Velampalli Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.. సీట్ల మార్పుపై తీవ్ర చర్చ సాగుతోంది.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ వచ్చిందంటే చాలు.. సీటు మార్పు ఖాయమనే చర్చ సాగుతోంది.. అంతే కాదు.. కొందరికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దు అని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. దీంతో, మంత్రులు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఇలా చాలా మందినిలో టెన్షన్ నెలకొంది.. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్…
Merugu Nagarjuna: మా నాయకుడి మాట మాకు వేదం.. గంగలో దూకమంటే దూకుతాం అని ప్రకటించారు మంత్రి మేరుగు నాగార్జున.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మేం స్కీములు తీసామని అంటున్నారు.. బహిరంగ చర్చకు రండి అంటూ సవాల్ చే శారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కార్యక్రమంపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందన్న ఆయన.. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు.. దానిలో అవకతవకలు జరిగాయన విమర్శించారు. మా నాయకుడిని చూసి…
Warangal Corona: వరంగల్‌లో కరోనా మరియు ఓమిక్రాన్‌ను ఎదుర్కొంటున్నప్పుడు, కొత్త వేరియంట్ నేపథ్యంలో అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు. ఈ మేరకు వరంగల్ ఎంజీఎంలో ప్రత్యేక వైద్యుల బృందాన్ని కూడా నియమించారు.
నెల్లూరు జిల్లాలో ఐదు వేల కోట్ల రూపాయల విలువైన సిలికాన్.. 3 వేల కోట్ల విలువైన తెల్ల రాయిని దోచేశారంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
కడప విమానానికి ఫుల్ ఆక్యుపెన్సీ ఉందంటే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. విశాఖలో భూముల దోపిడీ కోసం వాళ్ళంతా ఇక్కడకు వస్తున్నట్టు కనిపిస్తోంది అని ఆమె విమర్శలు గుప్పించారు. మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వంపై అబండాలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఎప్పుడు సమర్పించారో ప్రజలకు చెప్పాలి అని పురంధేశ్వరి ప్రశ్నించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో జడ్జిలపై ట్రోలింగ్ చేయటంపై క్రిమినల్ కంటెంప్ట్ కింద దాఖలైన పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలోనే ప్రతివాదులు 26 మందికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
వచ్చే ఎన్నికల్లో రోజాకు టిక్కెట్టు రాదని కోంత ది శునకానందంతో చేస్తూన్న ప్రచారం మాత్రమే అని మంత్రి రోజా తెలిపారు. గడప గడపకు మొదలుకోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ముందు వరుసలో నేనే ఉంటున్నాను అన్నారు. రాబోయే ఎన్నికలలో తప్పకూండా పోటి చేస్తాను.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కే సీట్లు లేకుండా రోండేసీ నియోజకవర్గాలలో సర్వే చెయ్యించుకుంటున్నారు.