Spirit: డార్లింగ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘స్పిరిట్’లో డాన్ లీ క్యామియో? మార్చి 1న అప్‌డేట్ వస్తోందా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా క్యాస్టింగ్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తాజాగా చిత్రబృందం కొరియన్ స్టార్ డాన్ లీని స్పెషల్ క్యామియో రోల్ కోసం సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిజానికి సందీప్ వంగా సినిమాల్లో క్యారెక్టర్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి, కొరియన్ స్టార్ డాన్ లీ స్పిరిట్ సినిమాలో భాగం అయితే వెండి తెరపై నిప్పులు చెలరేగడం తథ్యంగా కనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డాన్ లీ వంటి అంతర్జాతీయ నటుడు వెండి తెరపై కలిసి కనిపిస్తే ఈ సినిమా స్థాయి మరో లెవల్‌కు వెళ్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
సందీప్ వంగా రాసే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు సినిమాలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో ‘యానిమల్’ సినిమాతో అందరికీ అర్థమైంది. డాన్ లీ ఈ క్యామియోకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, మార్చి 1న ఒక చిన్న అప్డేట్ వచ్చే అవకాశముందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇకపోతే ఈ సినిమాలో కీ రోల్ విలన్‌గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ వివేక్ ఓబెరాయ్ ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్నారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉంది. రోజుకో వైరల్ న్యూస్‌తో ఈ సినిమాపై సోషల్ మీడియాలో మామూలుగా హైప్ పెరగడం లేదు. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చే స్పిరిట్ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు, సినిమా లవర్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
READ ALSO: Keralam: కేరళ ఇకపై ‘కేరళం’.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్!
తాజావార్తలు
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!