Land Grabbing: విశాఖలో భూ కబ్జా ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.. రాజకీయ నేతలు, అధికారులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారే విమర్శలు వినిపిస్తు్న్నాయి.. అయితే భూ కబ్జా కేసులపై ఫోకస్ పెట్టారు విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్.. రాజకీయ నాయకుల పేర్లు ఉపయోగించి వివాదాస్పద భూముల కబ్జాకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.. డయల్ యువర్ సీపీ, స్పందన కార్యక్రమాలకు ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వీటిపై దృష్టిసారించారు సీపీ రవిశంకర్.. కబ్జాదారులకు సహకరించిన వారిని కూడా భూ కబ్జాదారుగానే గుర్తిస్తామని స్పష్టం చేశారు.. వారిని పీడీ యాక్ట్ కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు.. అంతేకాదు, అవసరమైతే నగర బహిష్కరణ విధిస్తామన్నారు.
Read Also: Damodar Raja Narasimha: నేడు నిజామాబాద్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన..
భూకబ్జాలకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు, న్యాయవాదులు, విశ్రాంత ఎమ్మార్వోలు, వీఆర్‌వోలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులపై విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీస్ కమిషనర్ రవి శంకర్.. ఇప్పటికే భూకబ్జాలకు పాల్పడుతున్న వారిని, నకిలీ ధ్రువపత్రాలను సృష్టిస్తున్న ముఠాలను గుర్తించామని వెల్లడించారు. వీరిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా, మూడు రాజధానులపై ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. త్వరలోనే విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉంది.. మరోవైపు.. రాజకీయ నేతలు.. భారీ ఎత్తున భూములు కబ్జా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి, విశాఖ పోలీస్ కమిషన్ రవి శంకర్.. ఏ మేరకు భూ కబ్జాలకు చెక్ పెడతారు? అనేది వేచిచూడాల్సిన విషయం.