తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది.. గత రెండు రోజుల నుంచి భక్తులు తిరుమల కొండకు భారీ సంఖ్యలో వెళ్తున్నారు. డిసెంబర్ లో సెలవులు రావడంతో చివరి రెండు వారాల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
ఆంధ్ర ప్రదేశ్ లో రిజర్వేషన్ సౌకర్యం, ముద్రగడ పద్మనాభంపై గౌరవంతో కాపు సామాజిక వర్గం బలపరచడం వల్లే వైసీపీ 151 స్థానాలు కైవసం చేసుకుంది అని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అన్నారు. ఏపీలో టీడీపీ- జనసేన మధ్య ఉన్న బంధాన్ని బలహీన పరచడానికి వైసీపీలోని కాపు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లో కేవలం కమ్మ వాళ్లే ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకుంటున్నావు.. కమ్మవాళ్లల్లో కూడా కేవలం నీ చెంచా చంద్రబాబునే కోరుకుంటావు.. మద్యపానం నిషేధిస్తే పెద్ద పెద్ద ఫోటోస్ వేసి రాశావు.. మళ్లీ మద్యపానం కావాలని ఇన్కమ్ కోసం ఉండాలని నువ్వే రాశావు అని పోసాని కృష్ణ మురళి ఆరోపించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్రా అనే పథకం కాదు వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంతో ఆడుకుంటుంది.
వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రానున్న 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎం గా ఉండనున్నారు.. కొందరికి పార్టీలో కొన్ని సమీకరణాల కారణంగా పదవులు దక్కలేదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం పదవులు అందని వారికి జగన్ మళ్లీ న్యాయం చేస్తారు.
కార్తీక మాసం పోయిన తరువాత చికెన్ ధరలు క్రమంగా పెరగుతున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో మార్కెట్లో చికెన్ ధరలను పరిశీలిస్తే కిలో చికెన్ స్కిన్ లెస్ 260 రూపాయలకు అమ్ముతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ ను అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి మైన్ ఎదుట నిరసన చేస్తున్నారు.