Alla RamaKrishna Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో ఈ రోజు భేటీ కానున్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసంలో ఆయన్ని కలవనున్నారు సోదరి షర్మిల.. అయితే, చాలా గ్యాప్ తర్వాత అన్నా చెల్లెలు కలవనుండడం.. అది కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేముందు.. ఆయన్ని కలిసి వెళ్తుండడంతో.. ఫ్యామిలీ మీటింగే అయినా.. రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.. ఇక, ఇప్పటికే ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి.. తన ప్రయాణం వైఎస్ షర్మిలతోనే అని ప్రకటించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక, వైఎస్ జగన్‌తో సమావేశంపై ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈరోజు కేవలం వివాహ ఆహ్వానం ఇవ్వడానికి మాత్రమే వైఎస్ షర్మిల.. సీఎం జగన్ దగ్గరకు వస్తున్నారు.. అవసరమైతే షర్మిలతో నేను కూడా సీఎం జగన్ ఇంటికి వెళ్తానన్నారు ఎమ్మెల్యే ఆర్కే.. ఇక, సారవంతమైన భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవడం దుర్మార్గం అన్నారు. ఓటుకు నోటు కేసులో కాంప్రమైజ్ అయ్యేది లేదు.. సుప్రీంకోర్టులో ఈ కేసుపై పోరాడుతానని ప్రకటించారు.. ఓటుకు నోటు కేసు సీబీఐ దర్యాప్తు చేయాలని కోరారు.. మరోవైపు.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడంలో వైసీపీ లోపాలను ఎండగడతాం అన్నారు ఆర్కే.. ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలో మాకు తెలుసన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక మంది పనిచేస్తూనే ఉన్నారు.. నేను పార్టీలో కొత్తగా చేరుతున్నా.. సీనియర్లు నా ముందు వరుసలో ఉండాలని నేను కోరుకుంటాను అన్నారు.
ఇక, రాజకీయం వేరు కుటుంబ బంధాలు వేరు.. రాజకీయంలో నా వ్యక్తిగత నిర్ణయం నాది, అలాగని కుటుంబ బంధాన్ని పోగొట్టు కోను అన్నారు ఆర్కే.. రేపు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరుతారని స్పష్టం చేశారు. స్వతంత్ర ఉద్యమానికి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది.. సంస్థాగతంగా బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది.. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.