JC Prabhakar Reddy: రప్పా రప్పా, రాత్రిపూట కన్ను ఎగిరేస్తే ఎలా ఉంటుందో నీకు (బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి) తెలుస్తుంది అని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మీలాంటి భాష మేము మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు.. నీకంటే బండ బూతులు మాట్లాడడం నాకు వస్తుంది.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీన తాడిపత్రిలో వైఎస్సార్ సీపీ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు.. తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు.
Tadipatri Tension: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పోటాపోటీ కార్యక్రమాలకు తెలుగుదేశం- వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలు పిలుపునిచ్చాయి.
తాడిపత్రిలో ఆటవిక రాజ్యం నడుస్తోంది అని ఆరోపించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.. పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.. కానీ, హైకోర్టు ఆదేశాలు వచ్చి రెండు మాసాలైనా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదని మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.
అనంతపురం నగర సమీపంలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితులను ఆరు గంటల్లోపు పోలీసులు పట్టుకున్నారు పోలీసులు.. ఇవాళ ఉదయం రాచనాపల్లి సమీపంలో కుమ్మర సురేష్ బాబు దారుణ హత్యకు గురయ్యాడు.. దీనిపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. సురేష్ బాబు భార్య అనితను, ఫక్రుద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతపురం జిల్లాలో మరో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. అనంతపురం నగర శివారు బళ్లారి రోడ్డు సమీపంలో శివానంద అనే యువకుడు నిన్న దారుణహత్యకు గురయ్యాడు. నేడు అనంతపురం రూరల్ అక్కంపల్లి గ్రామ సమీపంలో కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో తలపై మోది హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. Also Read: Outsourcing Staff: ఉద్యోగుల నియామకాలపై మంత్రుల బృందం ఆరా.. వారంలో మరోసారి…
ఏపీలోని అనంతపురం నగర శివారు బళ్లారి రోడ్డు సమీపంలో శివానంద (30) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అన్నా క్యాంటీన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు శివానంద తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: Chevireddy Bhaskar Reddy: నోటీసులపై స్పందించని చెవిరెడ్డి.. తదుపరి చర్యలకు సిద్ధమవుతున్న విజిలెన్స్! గార్లదిన్నె…
హైకోర్టు ఆదేశాలను పోలీసులు అమలు చేయడం లేదని మండిపడ్డారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. నేను తాడిపత్రి వెళ్తే.. భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.. విశాఖలో ప్రధాన మంత్రి పర్యటన ఉందని.. భద్రత కల్పించలేమని ఎస్పీ జగదీష్ వివరణ ఇస్తున్నారు. ఇప్పటికే ఏడెనిమిది సార్లు నేను తాడిపత్రి పర్యటన వాయిదా వేసుకున్నా.. నాకు తాడిపత్రి లో సొంత ఇళ్లు ఉంది.. నా ఇంటికి నేను వెళ్తానంటుంటే పోలీసులు అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు..
Anantapur Crime: అనంతపురం జిల్లాలో జరిగిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కేసును చేదించిన అనంతరం జిల్లా ఎస్పీ జగదీష్ విలేకరులతో మాట్లాడారు. ఈ కేసులో నరేష్ అనే యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. తన్మయి మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం నివేదిక ప్రకారం, తలకు తీవ్ర గాయాలు రావడం వల్లే ఆమె మరణించిందని తేలిందని వెల్లడించారు. Read Also: Balakrishna : తిరుమలలో నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు…
Anantapur: ఆదివారం నాడు అనంతపురంలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన్మయను గుర్తు తెలియని దుండగులు అమానుషంగా హత్య చేసిన ఉదంతం గురించి తెలిసిందే. మణిపాల్ స్కూల్ వెనుక భాగంలో విద్యార్థిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఈ పాశవిక చర్య అక్కడి స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. తన్మయ కనిపించడంలేదని ఆమె తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు స్పందించలేదని విద్యార్థినీ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. Read Also:…