అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ముసలమ్మ దేవాలయంలో నెల రోజుల క్రితం హుండీ చోరీ జరిగింది.. అయితే, అనూహ్యంగా చోరీ సొత్తును నిన్న రాత్రి ఆలయ ఆవరణలో వదిలేసి వెళ్లారు దొంగలు.. ఇక, సదరు దొంగలు పడేసి వెళ్లిపోయిన నగదును వెలికితీసి పోలీసుల సమక్షంలో లెక్కించారు స్థానికులు..
తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కావాలని.. పోలీస్ భద్రత కల్పించాలంటూ జిల్లా ఎస్పీ జగదీష్ ను కోరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని.. ఆ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భద్రత కల్పించాలని కోరినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్.. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో ఎమ్మెల్యేను తీవ్రంగా మందలించారు సీఎం.. ఈ విషయం అయినా.. పరిణితితో వ్యవహరించాలని హెచ్చరించారు.. ఇలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా. నియోజకవర్గంలోనూ అందరినీ సమన్వయం చేసుకుని వెళ్లాలని హితవు చెప్పారు సీఎం చంద్రబాబు..
జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడిన మాటలు ఎంత కలకలం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతూ వచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా ఏకంగా మీడియా ముందుకు వచ్చి సదరు ఎమ్మెల్యేకి అల్టిమేటం జారీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి నీచంగా మాట్లాడతారా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ సత్తా ఏంటో చూపిస్తాం అని…
Kethireddy Pedda Reddy: అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడిగా పేరుగాంచిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తుతం వివాదాస్పద పరిణామాల నడుమ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో పెద్దారెడ్డి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సారి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, సోమవారం ఉదయం 10 గంటలకు స్వయంగా పోలీసులే ఆయనను తాడిపత్రికి తీసుకెళ్లాలని తెలిపింది. Infinix HOT 60i 5G: 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ ఉన్న ఫోన్…
ఒక పార్టీకి చెందిన నాయకుడు ఎంపీగా ఉండి..... ఆ పరిధిలో వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉంటే....ఆ లోక్సభ నియోజకవర్గం వ్యవహారాలు అంత సవ్యంగా జరగవన్నది సహజం. కానీ... అంతా ఒకే పార్టీ వాళ్ళయి ఉండి కూడా తేడాలు జరుగుతుంటే... దాన్నేమనాలి? అలాంటి ప్రశ్నలే వస్తున్నాయట ప్రస్తుతం అనంతపురం నియోజకవర్గం ప్రజలకు. టీడీపీ నుంచి గెలిచిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు, తన పరిధిలోని అదే పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య అస్సలు పొసగడం లేదని చెప్పుకుంటున్నారు.
JC Prabhakar Reddy: రప్పా రప్పా, రాత్రిపూట కన్ను ఎగిరేస్తే ఎలా ఉంటుందో నీకు (బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి) తెలుస్తుంది అని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మీలాంటి భాష మేము మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు.. నీకంటే బండ బూతులు మాట్లాడడం నాకు వస్తుంది.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీన తాడిపత్రిలో వైఎస్సార్ సీపీ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు.. తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు.