అనంతపురం అర్బన్ మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించాడు. అనంతపురం నగరంలోని కమ్మ భవన్‌లో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో మినీ మహానాడు జరిగింది. ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ముందే సాకే వెంకటేష్ అనే టీడీపీ కార్యకర్త పురుగుల మందు తాగాడు. పార్టీ కోసం కష్టపడిన తమకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే ఎదుటే వెంకటేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. Also Read: IPL 2025: అలాంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవద్దు! ఎస్సీ సామాజిక…
ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ అనంతపురంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా.. జాతీయ జెండా చేత పట్టుకుని నగర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్.. ఎమ్మెల్యేలు దగ్గుపాటి, పల్లె సింధూర, బండారు శ్రావణి ఇతర ప్రజా ప్రతినిధులు సహ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ ,మాజీ సైనికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ నుండి…
అనంతపురం జిల్లాలో రెండవ రోజు మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. గుత్తి మండలం బేతేపల్లి గ్రామంలో సోలార్ ప్లాంట్‌కు నేడు మంత్రి లోకేష్, రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా శంకుస్థాపన చేయనున్నారు. ఇండియాలో అతి పెద్ద రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దావోస్‌లో ఈ సంస్థ ఏర్పాటులో లోకేష్ కీలక పాత్ర పోషించారు. సుమారు 22 వేల కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు. తొలి దశలో 587 మెగా వాట్ల సోలార్, 250 మెగా…
అనంతపురంలో కొత్తరకం మోసం వెలుగు చూసింది.. కారులో సీఐ సార్ ఉన్నారంటూ చెప్పి కిరాణా షాపులో సరుకులు ఎత్తుకెళ్లారు దుండగులు.. పోలీసునంటూ ఏకంగా కిరాణా దుకాణం యజమానిని బెదిరించాడు ఓ దొంగ. తాను టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐనంటూ.. తనకు సరుకులు ఇవ్వాలని కిరాణా దుకాణం యజమానిపై రెచ్చిపోయాడు. సుమారు రూ. 3 వేలు విలువ చేసే సరుకులను తీసుకొని డబ్బులు చెల్లించకుండా అక్కడ నుంచి ఊడయించాడు. ఈ సంఘటన అనంతపురం నగరంలోని ఒకటో పట్టణ…
అక్కడ టీడీపీ శాసనసభ్యులకు అసలు మేం ఎమ్మెల్యేలమో కాదోనన్న అనుమానం వస్తోందా? పార్టీ అధికారంలో ఉందన్న ఆనందం కూడా వాళ్ళలో లేకుండా పోయిందా? ఇదెక్కడి ఖర్మరా… బాబూ.. అంటూ తలలు కొట్టుకుంటున్నారా? పార్టీ పవర్లోకి వచ్చినప్పటి నుంచి మా బతుకులు ఇలాగే ఏడిశాయని ఫ్రస్ట్రేట్ అవుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? వాళ్ళకొచ్చిన కష్టం ఏంటి? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారి కూటమి పవర్లోకి వచ్చాక అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీలయ్యారట ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు. ఏం……
వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం మూడో పట్టణ పీఎస్‌కు తరలించారు. ఇవాళ ట్రయల్ కోర్టు ముందు అనిల్‌ను పోలీసులు హాజరుపరచనున్నారు. రాజమహేంద్రవరం కారాగారంలో బోరుగడ్డ అనిల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు అనుమతితో రాజమహేంద్రవరం నుంచి అనంతపురంకు పోలీసులు తీసుకోచ్చారు. 2018లో 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr No 156/2018 u/s 419 186 506 ఐపీసీ కింద బోరుగడ్డ అనిల్‌పై కేసు నమోదు అయింది. ఐఏఎస్ అధికారి నంటూ అప్పటి…
చిట్టీల పుల్లయ్యను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. చిట్టీల పేరుతో రూ. 100 కోట్లు వసూళ్లు చేసి పుల్లయ్య పరారైన పుల్లయ్యను.. బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. కాగా.. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేసుకున్న సభ్యులను నిండా ముంచాడు చిట్టీల పుల్లయ్య. బాధితుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీంపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య, భూలక్ష్మి దంపతులు 18 సంవత్సరాల కిందట నగరానికి వచ్చారు. బీకేగూడ రవీంద్రానగర్ కాలనీ…
CM Chandrababu Naidu: అకాల వర్షాలు, వడగండ్ల వానల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లిలో ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ విషయాన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ఇతర అధికారులతో ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు. Read Also: Robinhood Trailer: నితిన్ ‘రాబిన్…
బాధ్యతగా ఉండాల్సిన ఆలయ సిబ్బంది తప్పటడుగులు వేశారు. దేవాలయంలో దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. ఉరవకొండ మండలం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఓ భక్తురాలు హుండీలో వేసిన నగలు మాయం చేశారని ఆలయ సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. అమిద్యాలకు చెందిన రంగయ్య, వనజాక్షి దంపతులు మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తాళిబొట్టు గొలుసు, ముక్కుపుడక, చెవి కమ్మలు, వెండి పట్టీలు మూటగట్టి వనజాక్షి హుండీలో వేసింది.…