Tadipatri Tension: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పోటాపోటీ కార్యక్రమాలకు తెలుగుదేశం- వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలు పిలుపునిచ్చాయి. రీకాలింగ్ చంద్రబాబు పేరుతో రేపు తాడిపత్రిలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరుపుతామని వైసీపీ పేర్కొంది. ఇదే సమయంలో తాడిపత్రి రూరల్ పరిధిలోని వీరాపురంలో టీడీపీ నాయకుల సమావేశం జరగబోతుంది. శాంతిభద్రతల దృష్ట్యా తాడిపత్రిలో వైసీపీ నిర్వహించే కార్యక్రమానికి పోలీసుల అనుమతి నిరాకరించారు.
Read Also: Prabhas : ఎన్నాళ్లకు డార్లింగ్.. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రభాస్
అయితే, ఒకే రోజున రెండు పార్టీలు భారీగా సభలు నిర్వహిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలగవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అనంతరపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడికి కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు ఇచ్చిన నోటీసులకు ప్రతిస్పందనగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి లేఖను రాశారు.