ఏపీలోని అనంతపురం నగర శివారు బళ్లారి రోడ్డు సమీపంలో శివానంద (30) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అన్నా క్యాంటీన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు శివానంద తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Chevireddy Bhaskar Reddy: నోటీసులపై స్పందించని చెవిరెడ్డి.. తదుపరి చర్యలకు సిద్ధమవుతున్న విజిలెన్స్!
గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన శివానందకు కూడేరు ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది. ఇటీవల గొడవల కారణంగా శివానంద భార్య మృతి చెందింది. తన కూతురును అల్లుడే హత్య చేశాడని శివానంద మామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదవడంతో శివానంద జైలుకు వెళ్లి వచ్చాడు. జైలుకు వెళ్లి వచ్చిన శివానందపై కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.