SI Cheating: ఎస్సై ప్రేమ వంచనకు యువతి బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆడవారిపై ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్నా ఫలితం సూన్యంగా మారుతోంది. మహిళలకు ఏదైన ఇబ్బందులు ఎదురైతే రక్షణ కవచలంగా వుండాల్సిన రక్షభటులే మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనే అనంతపురం జిల్లా పామిడి మండలం జీ.ఏ కొట్టాల గ్రామంలో చోటుచేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళితే ..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
అనంతపురం జిల్లా పామిడి మండలంలోని జీ.ఏ కొట్టాల గ్రామానికి చెందిన బీమ్లా నాయక్ కుమారుడు విజయ్ కుమార్ నాయక్ ప్రస్తుతం చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో జీ.ఏ కొట్టాల గ్రామానికి చెందిన తిరుపాల్ నాయక్ కుమార్తె సరస్వతి అనే యువతి తిరుపతిలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతూ ఉండేది. అయితే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. అయితే గత కొద్ది రోజుల క్రితం వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. రెండు రోజుల క్రితం మనస్థాపం చెందిన సరస్వతి స్వగ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శుక్రవారం చికిత్స పొందుతూ అనంతపురం ఆస్పత్రిలో మృతి చెందింది. తన ఆత్మహత్యకు ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ కారణమంటూ ఫిర్యాదు చేసి చనిపోయింది. దీంతో ప్రియురాలు ఆత్మహత్యతో ఎస్సై బండారం బయటపడింది.
అంతేకాకుండా గత ఏడాది ఎస్ఐ విజయ్ కువకు నాయక్ అనంతపురం కు చెందిన భారతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ప్రేమ వివాహమే… అప్పట్లో భారతీ తనను ప్రేమించి మోసం చేశాడంటూ అనంతపురం దిశా పోలీస్ స్టేషన్ లో విజయ్ కుమార్ నాయక్ పై డిఎస్పి ఆర్ల శ్రీనివాసులకు ఫిర్యాదు చేయడంతో దిశ పోలీస్ స్టేషన్ లో విజయ్ కుమార్ నాయక్ కు కౌన్సిలింగ్ ఇవ్వడంతో విజయ్ కుమార్ పెళ్లికి అంగీకరించాడు. దీంతో పెద్దల సమక్షంలో ఇరువురికి పెళ్లి జరిపించారు. పెళ్లి అయినా ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ లో ఎలాంటి మార్పు రాలేదు. ఎస్ఐ ఉద్యోగం రాక ముందు కూడా గుంతకల్లు మున్సిపల్ కార్యాలయంలో పని చేసే వాడని అప్పట్లో ఓ మహిళా కానిస్టేబుల్ ను ప్రేమ పేరుతో మోసం చేసినట్టు కూడా తెలుస్తోంది.
కాగా.. మృతురాలు సరస్వతి తండ్రి తిరుపాల్ నాయక్ ఫిర్యాదు మేరకు 376, 420, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పామిడి పోలీసులు. ఎస్.ఐ.విజయ్ కూమార్ నాయక్ ను అదుపులో తీసుకుని విచరణ చేపట్టినట్టు తాడిపత్రి డిఎస్సీ చైతన్య తెలిపారు.
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!