అనంతపురం జిల్లా శెట్టూరు మండలం, ములకలేడు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రును చికిత్సనిమిత్తం కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు.
ఇవాళ (శనివారం) వేకువజామున 5 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇంటి పైనున్న మిద్దె కప్పు కూలి.. నిద్రిస్తున్న వారిపై పడింది. పెద్ద శబ్ధం రావడంతో గ్రామస్థులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు, అధికారులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
శిథిలాలను తొలగించి చూడగా.. అప్పటికే నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో కనిపించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన జైనుబి(60), దాదు(35), షర్ఫున(30), ఫిర్దోజ్(6) గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
టీడీపీ రధం చక్రాలు ఊడిపోయాయి : మంత్రి మేరుగ నాగార్జున