MLA Mekapati Vikram Reddy Fires On Anam Ramanarayana Reddy: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు ఆనం కూడా ఓ కారకుడని ఆరోపించారు. అప్పట్లో ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఫైరయ్యారు. ఆనంకు మంత్రి పదవి ఎవరి వల్ల వచ్చిందో తనకు తెలుసనన్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యేగా, మున్సిపల్, ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు.. ఆనం ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన అభివృద్ధి చేసి ఉంటే.. 2014 ఎన్నికల్లో ఎందుకు ఓడారని సూటి ప్రశ్న సంధించారు. మళ్లీ తెలుగుదేశంలో చేరి, ఆత్మకూరుకు ఇంచార్జిగా ఉంటూ.. హడావుడి చేశారని దుయ్యబట్టారు. 2019లో వైసీపీలోకి వచ్చి, ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి వెళ్లారని విమర్శించారు. యువగళం పాదయాత్రలో అభివృద్ధి జరగలేదని ఆనం విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏం చేస్తున్నామో ప్రజలకు తెలుసన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను లోకేష్ చదివారన్నారు. దమ్ముంటే ఆ ఆరోపణలను నిరూపించాలని, నిరూపిస్తూ తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అదే ఆ ఆరోపణల్ని నిరూపించకుంటే, లోకేష్ ఇంకెప్పుడు ఇటువైపు రాకూడదని ఛాలెంజ్ చేశారు.
Kavya Thapar Hot Photoshoot: కావ్య థాపర్ హాట్ ఫోటోషూట్.. పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోవడం పక్కా!
ఇంతకుముందు కూడా.. ‘ఆత్మకూరు అభివృద్ధిపైన డిబేట్ పెట్టుకుందాం రా’ అంటూ ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఆత్మకూరు అభివృద్ధి గురించి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఆ పెద్దమనిషి మంత్రిగా ఉన్నప్పుడు ఆత్మకూరులో చేసిందేమీ లేదని విమర్శించారు. నాటుసారా తయారుచేసే వ్యక్తిని పక్కన పెట్టుకుని.. మద్యం గురించి ఆనం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాలంటీర్లకి, గృహ సారధులకి మధ్య తేడా తెలియకుండా మాట్లాడకూడదని సూచించారు. వైసీపీ మేనిఫెస్టోని టీడీపీ కాపీ కొట్టిందని మండిపడ్డారు. రాష్ట్రం అప్పులపాలు అయ్యిందని, మరో శ్రీలంకలా అయిపోయిందంటూ టీడీపీ పేర్కొనడం శోచనీయమని వ్యాఖ్యానించారు.
Revanth Reddy : దశాబ్ది ఉత్సవాలు.. పార్టీ కార్యక్రమం లెక్క మారింది