YSRCP Rebel MLAs Letter: నోటీసులపై స్పందించిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌కు లేఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Rebel MLAs Letter: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.. మూడేళ్ల క్రితం రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేయటంతో టీడీపీ అభ్యర్ది విజయం సాధించారు. దీంతో, ఈ సారి అలాంటి అవకాశం ఇవ్వకూడదని వైసీపీ పావులు కదుపుతోంది.. వారి పైన అనర్హత వేటు దిశగా చర్యలు మొదలు పెట్టింది.. వైసీపీ ఫిర్యాదు ఆధారంగా ఆ నలుగురికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు.. అయితే, తమకిచ్చిన నోటీసులపై స్పీకర్‌కు లేఖలు పంపించారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు..
Read Also: Thammineni Seetharam: బాబు, పవన్, బీజేపీ, షర్మిల కలిసి వచ్చినా మళ్లీ జగనే సీఎం..
Also Read
- Avengers Endgame Encore: బాహుబలి రికార్డులను బద్దలు.. ఇండియాలో సరికొత్త రికార్డు సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
- Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
- KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
స్పీకర్ కార్యాలయానికి లేఖలు పంపించారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి.. స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులకు రిప్లై ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు కోరుతూ ఆ లేఖల్లో పేర్కొన్నారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు.. ఇక, తాను అనారోగ్యంతో ఉన్నందున రిప్లై ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు కోరారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. తనను విశ్రాంతి అవసరమని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్‌ను స్పీకర్‌కు రాసిన లేఖకు జత చేశారు మేకపాటి. అయితే, లేఖల్లో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రాసిన లేఖలో ప్రధానంగా.. సహజ న్యాయ సూత్రాల ప్రకారం రిప్లై ఇవ్వడానికి 30 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుంది.. నోటీసుతో పాటు పంపిన పేపర్, వీడియో క్లిప్పింగ్‌లు అసలైనవో.. మార్ఫ్ చేసినవో నిర్ధారించుకోవాలి.. మాపై ఫిర్యాదు చేసిన వాళ్లు ఇచ్చిన ఆధారాల ఒరిజినల్స్ ఇవ్వాలి. సోషల్ మీడియా పోస్టింగులకు సంబంధించిన ఐపీ అడ్రస్సులు ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి. దీంతో.. రెబల్స్ ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయింది.
తాజావార్తలు
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డులను బద్దలు.. ఇండియాలో సరికొత్త రికార్డు సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!