అనర్హత నోటీసుపై స్పీకరు తమ్మినేని సీతారాంను వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలిశారు. స్పీకర్ తో పర్సనల్ హియరింగ్ కు హాజరుకావడం రెండోసారి అని అన్నారు. మొదటి సారి హాజరైనప్పుడు చాలా వివరాలు అడిగారనీ.. అవన్నీ తాను చెప్పినట్లు ఆనం తెలిపారు. దానికి సంబంధించిన పేపర్స్ ను కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనర్హత నోటీసుపై స్పీకర్ కు 5వ తేదీన తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఇచ్చామని అన్నారు. మీడియాలో ప్రచురించిన వాటిని చీఫ్ విప్ ప్రసాదరాజు ఆధరైజ్ చేసి ఇచ్చారని ఆనం తెలిపారు. వేరే మేనేజ్మెంట్ కు సంబంధించినవి మీరెలా ఆధరైజ్ చేస్తారని అడిగానన్నారు. ఆరోపించిన ప్రసాదరాజు ఆథరైజ్ చేస్తే వాటికి విలువ ఉండదని అన్నారు. పెట్టిన సాక్ష్యాధారాలు ఏవీ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం విలువైనవి కావని ఆరోపించారు. ఇవి తీసుకుని మీరెలా చేస్తారని స్పీకర్ ను అడిగినట్లు ఆనం చెప్పారు.
Read Also: AP Politics: ఢిల్లీలో ఏపీ పొలిటికల్ హీట్..
మరోవైపు.. వైసీపీ నుంచి నేను తప్పుకోలేదు… నన్ను తప్పించారు.. అప్పుడే నేను బయటకొచ్చానని కీలక వ్యాఖ్యలు చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. ప్రశాంతమైన తమ ప్రాంతంలో మైనింగ్ దగ్గర నుంచీ అంతా మాఫియాగా మారిందని ప్రశ్నించానని.. అందుకు తనను తప్పించారన్నారు. మరోవైపు.. రాజకీయ స్వార్ధం కోసం అధికార పార్టీ స్పీకర్ స్థానాన్ని వాడుకుంటుందని ఆరోపించారు. అనర్హత వేటు విషయంలో జరుగుతున్న దానిని స్పీకరుకు మాత్రమే ఆపాదించలేమన్నారు. అధికార పార్టీ స్వార్థ రాజకీయాలే గందరగోళ పరిస్థితికి నెట్టాయని ఆయన తెలిపారు. తన ఐదేళ్ల ఎమ్మెల్యే పదవీ కాలంలో చివరి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యాయని.. ఆ తృప్తి ఉందన్నారు. నాలుగు రోజుల ముందు నిర్ణయం వచ్చి ఉంటే బాధపడేవాడినని ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.
Read Also: AP Politics: ఆసక్తిరేపుతున్న ఏపీ రాజకీయాలు.. ఈ పార్టీల మధ్య పొత్తు ఖరారు