Mekapati Vikram Reddy Challenges To Nara Lokesh To Debate On Development: ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని.. టైం, ప్లేస్ చెప్పాలని నారా లోకేష్‌కు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సవాల్ విసిరారు. ఆత్మకూరులో అభివృద్ధి ఏమీ లేదని మాట్లాడడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చూసి, నిజాలు తెలుసుకోకుండా లోకేష్ మాట్లాడుతున్నాడని విమర్శించారు. తాము సంక్షేమ పథకాలను ప్రజలకు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న టీడీపీ.. ఇప్పుడు ఆ వైసీపీ పథకాలనే కాపీ కొడుతోందని దుయ్యబట్టారు.
Bandi Sanjay: అభివృద్ధి నిధుల పై ముఖ్యమంత్రి చర్చకి వస్తారా? బండి సంజయ్ సవాల్!
2014లో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి.. రాష్ట్రం విడిపోతుంటే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం పాకులాడిన ఆనం.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి గానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఆలోచించలేదని అన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపీగా ఉన్నప్పుడు హై లెవల్ కెనాల్‌కు ప్రతిపాదన చేస్తే.. రాజశేఖర్ రెడ్డి హయాంలో దానికి రూపకల్పన జరిగిందని గుర్తు చేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన వారితో పాటు సోమశిల హై లెవల్ కెనాల్‌కు కారణమైన వారి గురించి ఆనం అసలు మాట్లాడకపోవడం సరికాదని మండిపడ్డారు. ఇసుక, మట్టి ద్వారా అవినీతి జరిగిందన్న ఆనం.. ఎక్కడ అవినీతి జరిగిందో చూపించాలని డిమాండ్ చేశారు. కేవలం తన సొంత అభివృద్ధి కోసమే 40 ఏళ్ల నుంచి ఆనం రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. లోకేష్ సభల కోసం ప్రజలకు డబ్బులిచ్చినా ప్రజలు రాలేదని ఎద్దేవా చేశారు.
New Bride Escape: నగదుతో నవ వధువు ఎస్కేప్.. లబోదిబోమంటున్న కొత్త పెళ్లి కొడుకు
అంతకుముందు కూడా.. రాష్ట్ర విభజనకు ఆనం కారణమంటూ మేకపాటి విక్రమ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆనంకు మంత్రి పదవి ఎవరి వల్ల వచ్చిందో తనకు తెలుసన్న ఆయన.. ఎమ్మెల్యేగా, ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఆనం ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. నిజంగా అభివృద్ధి చేసి ఉంటే.. 2014 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. 2019లో వైసీపీలోకి వచ్చి, ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి వెళ్లిన ఆనం.. లోకేష్ పాదయాత్రలో అభివృద్ధి జరగలేదని విమర్శలు చేయడం సరికాదన్నారు. తనపై లోకేష్ చేస్తున్న ఆరోపణల్ని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకపోతే లోకేష్ ఇంకెప్పుడు ఆత్మకూరు వైపు రాకూడదని సవాల్ విసిరారు.