Anam Ramanarayana Reddy Sensational Comments: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై విమర్శలు చేస్తారని.. కానీ వైసీపీకి చెందిన నేతలు సొంత పార్టీకి చెందిన నేతలు, వారి ఇంట్లోని మహిళల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది నెల్లూరు రాజకీయ సంస్కృతి కాదని హితవు పలికారు. ఎన్నికల్లో టికెట్‌కు మీకు పోటీ వస్తున్నారని భావించి, కుటుంబంలోని స్త్రీల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. ఈ ధోరణి బాధాకరమైందని, మంచి సంప్రదాయం కాదని పేర్కొన్నారు. నెల్లూరు ప్రజలు తెలివైనవారని, ఎవర్ని ఎక్కడ కట్టడి చేయాలో వాళ్లకు తెలుసని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు తెలియచెప్పేందుకే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అనైతిక పాలన, దోపిడి జరుగుతోందన్నారు. త్వరలోనే దీనికి మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరించారు.
Ileana D’Cruz : తన ప్రెగ్నెంట్ జర్నీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇలియానా..
టీడీపీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులను వైసీపీ వైపు తిప్పుకున్నారన్న ఆనం.. ఆ ముగ్గురి చేత రాజీనామా చేయించారా? అని నిలదీశారు. అక్రమ సంపాదనకు వారిని అడ్డుపెట్టుకున్నారని ఆరోపించారు. మొదట ఆ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని, ఆ తర్వాత తమని అడగాలని డిమాండ్ చేశారు. ఇంకా ఏడాది అధికారం ఉన్నా, వద్దని తాను బయటకు వచ్చానన్నారు. తాను గతంలో నెల్లూరు, రాపూరు, ఆత్మకూరు, వెంకటగిరిల నుంచి పోటీ చేశానని.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, కొన్నిసార్లు ఓడిపోయానని గుర్తు చేశారు. చంద్రబాబు ఆదేశిస్తే.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నా, అందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఒకవేళ పది నియోజకవర్గాల గెలుపు బాధ్యతను అప్పగిస్తే.. ఆ పని కూడా చేస్తానన్నారు. 1983లో టీడీపీ తరఫున నెల్లూరు నుంచి పోటీ చేసి గెలిచానన్నారు.
Anil Kumar Yadav: ఆనంకి ఎమ్మెల్యే అనిల్ ఛాలెంజ్.. ఓడిపోతే తప్పుకుంటా
రాజకీయాల నుంచి విరమించుకునే ముందు.. నెల్లూరు నుంచి పోటీ చేయాలని తాను భావిస్తున్నానని ఆనం అన్నారు. తన రాజకీయ జీవితం మొదలైన నెల్లూరులోనే ముగింపు కూడా కావాలని అనుకుంటున్నానని అన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతోందని ఆనం ఆరోపించారు. మాదక ద్రవ్యాలకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చేశారన్నారు. ప్రభుత్వమే దీనిని ప్రోత్సాహిస్తోందని కుండబద్దలు కొట్టారు. ఒక్క అవకాశం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.