CM MK Stalin: 2026లో తమిళనాడులో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తిప్పికొట్టారు. మా తమిళనాడు రాష్ట్రం ఎప్పటికీ ఢిల్లీ నియంత్రణలో ఉండదని అన్నారు. “పార్టీలను విచ్ఛిన్నం చేయడం, సభ్యులను బెదిరించడమే బీజేపీ ప్రణాళికలు.. అవి తమిళనాడులో పని చేయవని పేర్కొన్నారు. బలవంతంగా హిందీని రుద్దడంతో పాటు డీలిమిటేషన్ తో తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని అంగీకరించలేదన్నారు. “తమిళ ప్రజలకు గుర్తింపు, గౌరవం లేని బీజేపీతో ఏఐడీఎంకే జతకట్టడం.. రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం వంటిదే” అని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.
Read Also: Transgender Marriage: నేను ఆ హిజ్రానే పెళ్లి చేసుకుంటా.. లేకపోతే రైలు కింద పడి సచ్చిపోతా..
ఇక, ఎన్నికలకు ముందు బీజేపీ ఎలాంటి బెదిరింపులకు పాల్పడుతుందో మాకు బాగా తెలుసు అని సీఎం స్టాలిన్ తెలిపారు. మేము అలాంటి ఒత్తిడికి లొంగిపోయే వ్యక్తులం కాదు.. మా తమిళనాడులో అమిత్ షా చాణక్యం పని చేయదని పేర్కొన్నారు. తాను బ్రతికి ఉన్నంత కాలం అమిత్ షా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు వేసే ప్రణాళికలు విజయవంతం కావని అన్నారు. తమిళనాడు ఎప్పటికీ ఢిల్లీ నియంత్రణకు లొంగదు అని తేల్చి చెప్పాడు. తమిళ దేశద్రోహులతో పొత్తులు ఏర్పాటు చేసుకుని గెలుస్తామని మీరు నమ్ముతున్నారా? అని స్టాలిన్ ప్రశ్నించారు.