బ్యాంకాక్ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి మయన్మార్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న తెలంగాణకు చెందిన యువతకు విముక్తి లభించింది. వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాగా, మరొకరు ఏపీకి చెందిన వ్యక్తి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని వీరిని స్వదేశానికి రప్పించారు.
READ MORE: Telangana Inter Results 2025: ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచిన జిల్లాలు ఇవే..
బ్యాంకాక్ లో మంచి జాబ్ ఉందని, ప్రతినెలా లక్షల రూపాయల జీతం వస్తుందని బ్రోకర్ ఆశ చూపడంతో వీరంతా నిజమేనని నమ్మి మోసపోయారు. ఇదే విషయంపై రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కోహెడకు చెందిన మయన్మార్ బాధితుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా ఏరియాలో ఉండే యశ్ నాథ్ గౌడ్ అనే వ్యక్తి బ్యాంకాక్ లో మంచి ఉద్యోగం ఉందని ఆశ చూపడంతో నిజమేనని నమ్మా. జగిత్యాలలోని బ్రోకర్ల ఏజెంట్ ( టీం లీడర్) వంశీకృష్ణ వద్దకు తీసుకుపోయిండు. వంశీకృష్ణే నన్ను ఇంటర్వ్యూ చేశాడు. బ్యాంకాక్ కు 200 కి.మీల దూరంలోనే జాబ్ అని చెప్పి తీసుకుపోయారు. తీరా అక్కడికిపోతే రోజుకు 16 గంటల పని అప్పగించారు. ఆ పని ఏందంటే సైబర్ క్రైమ్. ఆ పని చేయకపోతే భోజనం కూడా పెట్టకపోయేవాళ్లు. 5 నెలలు ఆ కంపెనీలో పనిచేశా. అట్లాంటి పనిచేయడం నాకిష్టం లేక మొండికేశా. దీంతో అక్కడున్న చైనీస్ వాళ్లు నా పాస్ పోర్టు గుంజుకున్నరు. అన్నం కూడా పెట్టకుండా హింసించారు. అయినా వినకపోవడంతో వాళ్లు అక్కడున్న ఆర్మీ వాళ్లకు చెప్పి మేం దొంగతనంగా ఆ దేశానికి వచ్చామని చెప్పి ఆర్మీ వాళ్లకు పట్టించారు. వాళ్లు మమ్ముల్ని జైల్లో వేశారు’’ అని బాధితుడు వాపోయారు.
READ MORE: Telangana Inter Results 2025: ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచిన జిల్లాలు ఇవే..
ఇటీవల మయన్మార్ నుంచి వందలాది మంది తనలాంటి బాధితులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వదేశానికి రప్పించారని తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చానని రాకేష్ రెడ్డి తెలిపారు. ‘‘మా నాన్న యాదిరెడ్డి బండి సంజయ్ సార్ కు లెటర్ రాసిన వెంటనే స్పందించి విదేశాంగ శాఖకు లేఖ రాయడంతోపాటు వెంటనే మమ్ముల్ని స్వదేశానికి రప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. బండి సంజయ్ సార్ కు మా కుటుంబమంతా రుణపడి ఉంటుంది.’’ అని పేర్కొన్నారు. రాకేశ్ రెడ్డితోపాటు కోహెడకు చెందిన ఏ.శివశంకర్, కరీంనగర్ జిల్లాకు చెందిన కనూరి గణేశ్ తోపాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆకుల గురు యువ కిశోర్ బ్రోకర్ల బారిన పడి మయన్మార్ లో సైబర్ క్రైం వెట్టి చాకిరి చేస్తూ తీవ్రమైన హింసలకు గురయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మయన్మార్ లో పలువురు తెలుగు రాష్ట్రాల యువతతోపాటు వందలాది మంది భారతీయులు సైబర్ క్రైమ్ వెట్టి చాకిరి చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని, త్వరలోనే వారందరినీ స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Tags: