కమలం పార్టీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేజ్రీవాల్ పంజాబ్ సర్కార్ వనరులను వినియోగించుకుని.. మురికివాడల దగ్గర చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.
Sanjay Raut: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గత గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన సైఫ్‌ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స, ఇతర చికిత్స అనంతరం ఈ రోజు ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. Read Also: Delhi Election: మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ.. విద్యార్థులే…
Amit Shah: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు ఇప్పటికీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రియాక్ట్ అయ్యారు. ఇది నక్సల్స్ లేని భారత్ దిశగా కీలక అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు.
Rahul Gandhi: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దొరికింది. లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీపై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ పై దాఖలైన పరువు నష్టం కేసులో ఆయనపై నమోదైన క్రిమినల్ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేస్తున్నట్లు ఈరోజు (జనవరి 20) ప్రకటించింది.
విజయవాడ కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకం టెంట్ దగ్గర కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే కుర్చీలు వేశారు అధికారులు.
హైదరాబాద్‌లో అఫ్జల్‌గంజ్ కాల్పుల దుండగులు.. అఫ్జల్‌గంజ్ కాల్పులు జరిపిన దుండగులు హైదరాబాద్‌లోనే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ ముఠా ఇంకా రాష్ట్రం దాటలేదన్నారు. పూటకో డ్రెస్ తో హైదరాబాద్ గల్లీల్లోనే తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఆటోల్లో ప్రయాణిస్తూ.. పోలిసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు.. హైదరాబాద్ లోని ప్రతి ఏరియా తెలిసి ఉండటం వల్లే.. అంత ఈజీగా తిరుగుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దుండగులకు ఎవరో ఒకరు హైదరాబాద్ కి చెందిన వాళ్ళే షెల్టర్ ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంతో పట్టుదలతో జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)ను పర్యవేక్షిస్తున్నారని, ఆయన పని తీరు చూస్తే తనకు అసూయ కలుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ డిపార్ట్మెంట్ వాళ్లు చేయలేని పనిని చేసే శక్తి ఎన్డీఆర్ఎఫ్కు ఉందన్నారు. జపాన్, నేపాల్, టర్కీ విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సేవలు అద్భుతమని ప్రశంసించారు. కేంద్రం నుంచి ఇప్పటికే ఏపీకి చాలా సాయం అందిందని, ఇంకా చాలా సహకారం కావాలని అమిత్…
గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర హోమంత్రి అమిత్ షా చేసిన సహకారం మరువలేనిదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 1.57 లక్షల ప్రజల ప్రాణాలను జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) ఇప్పటిదాకా కాపాడిందన్నారు. వసుధైక కుటుంబకం అని ప్రధాని మోడీ చెప్పినట్టుగా 19,365 మూగజీవాలని కాపాడిందని ప్రశంసించారు. ఎల్జీ పాలిమర్స్ లాంటి ఘటనలు, విజయవాడ వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు గణనీయం పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి సైతం భారత దేశాన్ని…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించనుంది. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీలోపు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ ఎన్నికల వరకు బీజేపీకి నాయకత్వం వహిస్తారు. అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం 2024 జనవరిలో ముగియాల్సి ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నడ్డా పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు.