Bengal CM Mamata: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వక్ఫ్ చట్టంపై చెలరేగిన హింసతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ ముస్లిం సంఘాల నేతలతో సీఎం మమతా బెనర్జీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వక్ఫ్ చట్టంపై జరిగిన హింస “ప్రణాళిక ప్రకారం” జరిగిందని పేర్కొనింది. బంగ్లాదేశ్ కు రోహింగ్యాలను రాష్ట్రంలోకి అనుమతించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీఎస్ఎఫ్ దళాలు కుట్ర పన్నాయని ఆరోపించింది. అయితే, వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పోరాటంలో తమ పార్టీ ముందంజలో ఉందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి తెలిపింది. ఇక, ముస్లిం ప్రజలు శాంతియుత నిరసనలు చేపట్టాలని మమతా బెనర్జీ కోరింది.
Read Also: CM Chandrababu: ఆర్థిక సంఘం బృందానికి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.. కీలక అంశాలపై చర్చ..
ఇక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కుట్రలు చేసి అధికారంలోకి రావడానికి అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరుతున్నాను అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనింది. ఇప్పటికే రాష్ట్రంపై అన్ని ఏజెన్సీలను ఉపయోగించి నాయకులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని తెలిపింది. ఇప్పటికైనా హోంమంత్రి అమిత్ షాను ప్రధాని అదుపులో పెట్టాలి.. లేకపోతే రాబోయే ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మమతా బెనర్జీ హెచ్చరించింది.