అగ్ర రాజ్యానికి అధిపతి అయినా ఆయన తన చేష్టలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. అతనెవరో కాదు అమెరికా అధ్యక్షులు జో బైడెన్. ఉన్నట్టుండి మరచిపోవడం.. ఒకవైపు వెళ్లాల్సి ఉండి మరోవైపు వెళుతుండటం.. ఉన్నట్టుండి కిందపడిపోవడం ఇటువంటి చేష్టలతో ఆయన సోషల్ మీడియాలో ఉంటారు.
అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణ మూలాలు ఉన్న కుర్రాడు కూడా ఇపుడు ప్రతిష్ఠాత్మకమైన ‘అమెరికా ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్-2023’కు ఎంపికయ్యాడు. వర్జీనియాలోని ఫెయిర్ఫాక్స్లో హైస్కూల్ సీనియర్స్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న తేజ కోడూరు 2023 ఏడాదికి గాను ‘ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్’కు ఎంపికైనట్టు అమెరికా విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
చిన్నపిల్లలు తమకు ఇష్టమైన పదార్థాలను చాలా ఎక్కువగా తింటుంటారు. కొన్ని ఆహార పదార్థాల వల్ల అనర్థం వాటిల్లుతుందని తెలియక అనారోగ్యానికి గురవుతుంటారు. అమెరికాలోని ఓ 5 ఏళ్ల బాలుడు ఇంట్లో పేరెంట్స్ తెచ్చిపెట్టుకున్న షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ ప్యాకెట్ జేబులో పెట్టుకున్నాడు.
అగ్రరాజ్యం అమెరికా దివాళా అంచున కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు అప్పులు పెరిగిపోయి.. మరోవైపు కొత్త అప్పులు తీసుకునే అవకాశం లేక బైడెన్ సర్కార్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్ చేతులెత్తేశారు. జూన్ 1 వరకు కాంగ్రెస్ అప్పుల పరిమితి పెంచకపోతే.. దివాళా తీయడం ఖాయమని తేల్చి చెప్పారు. దివాళా అంచు వరకు వచ్చాక.. బైడెన్ సర్కార్కు కాస్త ఊరట లభించింది.
మెక్సికోలో కాస్మెటిక్ సర్జరీలతో సంబంధం ఉన్న ఫంగల్ మెనింజైటిస్ వ్యాప్తిపై ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని అమెరికా, మెక్సికోలోని అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థకి విజ్ఞప్తి చేసింది.
Diwali Holiday in US: భారత ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళికి ఇకపై అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా అధికారిక సెలవు ఇవ్వబోతున్నారు. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? అమెరికాలో దీపావళిని ఫెడరల్ హాలీడేగా ప్రకటించాలని కోరుతూ అమెరికా చట్ట సభ్యురాలు ఒకరు ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో శుక్రవారం గ్రేస్ మెంగ్ ఈ ప్రత్యేక బిల్లును ప్రవేశ పెట్టారు. గ్రేస్ మెంగ్ ప్రతిపాదనను కొందరు చట్టసభ్యులతోపాటు అమెరికాలోని భారతీయ కమ్మూనిటీ హర్షం వ్యక్తం…
America : తల్లిదండ్రుల కష్టాలు చూసి చలించి బాగా చదివి వారి కళ్లలో పెట్టి చూసుకుందామనుకున్నాడు. ఉన్నత విద్య పూర్తి చేసి కుటుంబానికి అండగా నిలవాలని భావించాడు.
US Debt Ceiling Crisis: అమెరికా ఆర్థిక సంక్షోభం అంచున నిలిచింది. అమెరికా రుణపరిమితి పెంచడంపై అధికార డెమోక్రాట్స్, విపక్ష రిపబ్లికన్ల మధ్య ఒప్పదం కుదరలేదు.
Mexico : ఉత్తర అమెరికాలోని మెక్సికోలో భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది రోడ్డు రేసర్లు మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం కార్ షోలో కాల్పులు జరిగాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో కాల్పులు జరిగినట్లు ప్రాథమిక సమాచారం.