Texas Gun shooting: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ అఘాంతకుడు 8 ఏళ్ల చిన్నారితో సహా ఐదుగురిని అత్యంత క్రూరంగా కాల్చిచంపాడు. ఈ ఘటన టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో జరిగింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు శాన్ జాసింటో కౌంటీ షెరీఫ్ పోలీసులు శనివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు వేధింపులకు సంబంధించి ఓ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత, సదరు ప్రాంతానికి పోలీసులు వెళ్లి చూడటంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి…
అమెరికాలోని అలస్కాలో యూఎస్ మిలిటరీకి చెందిన రెండు హెలికాప్టర్లు కూలిపోయాయి. మిలటరీ శిక్షణలో భాగంగా రెండు ఆర్మీ హెలికాప్టర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. శిక్షణ విమానాలు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.. గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం పనిచేస్తున్న వీర సాయిష్‌ని నిన్న రాత్రి కాల్చి చంపారు దుండగులు.. ఆ విద్యార్థి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు… ఉన్నత చదువుల కోసం (ఎమ్మెస్) అమెరికా వెళ్లిన సాయిష్ ప్రాణాలు ఇలా పోవడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇండియాకు చెందిన ఇద్దరు తెలుగు యువకుల మృతిలో పాలకొల్లుకు చెందిన సాయిష్ ఒకరు.. మరో నెలరోజుల్లో చదువు పూర్తి చేసుకునే…
చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా తర్వాత యువకుల్లో గుండెపోటులు ఎక్కువయ్యాయి.
Illicit Relationship: ఆరుగురు మహిళా టీచర్లు విద్యార్థులతో లైంగిక సంబంధాలు నెరపడంతో అమెరికా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రెండు రోజలు వ్యవధిలో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలోని డాన్ విల్ కు చెంది ఎలెన్ షెల్(38) 16 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అర్కన్సాకు చెంది హెథర్ హరే(32) మరో టీనేజ్ విద్యార్థితో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నట్లు కేసు నమోదు అయింది.
ఉక్రెయిన్ యుద్ధంలో ఏ దేశానికి ఆయుధాలు విక్రయించబోమని చైనా ప్రతిజ్ఞ చేసింది. యుద్ధంలో తలమునకలైన రష్యా, ఉక్రెయిన్లలో ఎవరికీ ఆయుధాలు విక్రయించబోమని ప్రకటించింది. బీజింగ్ రష్యాకు సైనిక సహాయం అందించగలదనే పాశ్చాత్య ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ శుక్రవారం చెప్పారు.
Donald Trump: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ కేసులో డొనాల్డ్ ట్రంప్ న్యాయపరమైన విచారణ ఎదుర్కొంటున్నారు. 2016 ఎన్నికల ముందు స్టార్మీ డేనియల్ తో ఉన్న శృంగార సంబంధాన్ని దాచిపెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు మాజీ అధ్యక్షుడు ట్రంప్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుల నేపథ్యంలో ఆయన న్యూయార్క్ మాన్ హట్టన్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. మొత్తం 34 అభియోగాలను ఎదుర్కొంటున్నారు ట్రంప్.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఆయన అసమర్థత వల్లే అమెరికా ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతుందని విమర్శిస్తు్న్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ ఆరోపణలతో పలు కేసులను ఎదుర్కొంటున్నారు ట్రంప్.
అక్రమ మార్గాల ద్వారా భారతీయులను అమెరియాలోకి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను అమెరికాన్ పోలీసులు పట్టుకున్నారు. భారత పౌరుడు సిమ్రంజిత్ సింగ్ ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
America: అమెరికాలోని అర్కాన్సాస్, ఇల్లినాయిస్లో టోర్నడో సృష్టించిన విధ్వంసం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 21కి చేరింది. డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ తుపాను కారణంగా పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి.