ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది, ఈ సంవత్సరం ఇప్పటివరకు ప్యాంగ్యాంగ్ నిర్వహించిన నిషేధిత ఆయుధ పరీక్షల్లో తాజాది అని దక్షిణ కొరియా సైన్యం గురువారం తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 27శాతం పెరిగాయి. ప్రధానంగా అమెరికా, చైనా, యూరోపియన్ దేశాలకు అధిక మొత్తంలో ఎక్స్ పోర్ట్స్ అయ్యాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డీవీ స్వామి వెల్లడించారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో అగ్రరాజ్యం సాయుధ డ్రోన్ల సరఫరా ఆఫర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారులు ఈ విషయాన్ని తెలిపారు.
ఈ నెలాఖరులో జరిగే రాష్ట్ర పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి రెడ్ కార్పెట్ పరిచేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అధికారిక ప్రదర్శనతో పాటు, ప్రధాని మోదీకి అంకితం చేసిన ప్రత్యేక ‘థాలీ’ రూపంలో అద్భుతమైన స్వాగతాన్ని అందజేస్తారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా పలు సమావేశాల్లో ఆయన మాట్లాడుతున్నారు. విద్యార్థులతోపాటు ఇతరులతోనూ సమావేశం అవుతున్నారు.
యూఎస్ వ్యవస్థలకు వ్యతిరేకంగా పని చేస్తున్న వాటిని గుర్తించి హెచ్చరికలను జారీ చేస్తుంది. అమెరికాకు ప్రమాదం పొంచి ఉంటే సకాలంలో ముప్పును గుర్తించడంతో పాటు దాన్ని ట్రాక్ చేయడం వంటి సామర్థ్యాన్ని ఈ ఆర్బిటర్ కలిగి ఉంది అని స్పేస్ ఫోర్స్ విశ్లేషకులు తెలిపారు.
భారతదేశంలోని ప్రజాస్వామ్యాన్ని అభినందిస్తూ.. వైట్హౌస్లోని జాతీయ భద్రతా మండలిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ల కోఆర్డినేటర్గా ఉన్న జాన్ కిర్బీ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశంలో ప్రజాస్వామ్యం శక్తివంతంగా ఉందని అన్నారు.
US Army : మీరు రజనీకాంత్ రోబో సినిమా చూసి ఉంటారు. చిట్టి అనే రోబో దాని యజమానికి వ్యతిరేకంగా మారి, ప్రతిదీ నియంత్రించడం ప్రారంభిస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో కూడా మెషీన్లను 'తిరుగుబాటు'గా చూపిస్తారు. నిజజీవితంలో కూడా ఇలా జరిగితే.. అవును అమెరికా సైన్యం ముందు అలాంటి ఆశ్చర్యకరమైన కేసు ఒకటి తెరపైకి వచ్చింది.
America: భారతీయ సంతతికి చెందిన 14 ఏళ్ల చిన్నారి అమెరికాలో అద్భుతం చేశాడు. ఇక్కడ జరిగిన పోటీలో 11 అక్షరాల పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పడం ద్వారా అతను 50 వేల డాలర్లు అంటే రూ.41.17 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు.