Corona cases: అమెరికాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. యూఎస్ అంతటా డిసెంబర్ 17-23 వరకు కోవిడ్ కారణంగా 29 వేల మంది రోగులు ఆసుపత్రిలో చేరారు. ఈ సమయంలో 14 వేల 700 మంది రోగులు జ్వరం కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అమెరికాలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కొన్ని రాష్ట్రాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ తో పాటు మసాచుసెట్స్‌లోని ఆసుపత్రులలో రోగులు మాస్క ధరించడం తప్పనిసరి చేసింది.
Read Also: AP CM Jagan: కేసీఆర్ ను పరామర్శించిన జగన్.. లంచ్ తరువాత లోటస్ ఫాండ్ కు..
ఇక, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డేటా ప్రకారం.. అమెరికాలో కరోనా కారణంగా 11 లక్షల మంది రోగులు మరణించారు. చికాగోలోని రష్ యూనివర్శిటీ మెడికల్ సిస్టమ్ కూడా ఆసుపత్రి క్యాంపస్‌లో రోగులతో పాటు ఆరోగ్య కార్యకర్తలు మాస్కులు తప్పనిసరి చేసింది. గత వారం న్యూయార్క్ నగరం నగరంలోని 11 ప్రభుత్వ ఆసుపత్రులకు మాస్క్‌లు ధరించాలని చెప్పింది.. లాస్ ఏంజిల్స్, మసాచుసెట్స్‌లోని కొన్ని ఆసుపత్రులలో ఇలాంటి చర్యలు గత వారం నుంచి కొనసాగుతున్నాయి.
Read Also: Sankranthi Movies: డైలమాలో ఈగల్? ముందుకొచ్చిన నా సామిరంగ?
అయితే, పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. నూతన సంవత్సర సెలవుల తర్వాత అమెరికన్లు రోజువారీ జీవితంలోకి తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాతో పాటు జ్వరాలు రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జపాన్, భారత్ తో పాటు అనేక దేశాలలో కరోనా జెఎన్.1 వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్‌పై అమెరికా కూడా ఆందోళన చెందుతోంది.