New York Sinking: అమెరికాలోని అతిపెద్ద నగరం, ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన న్యూయార్క్ నెమ్మనెమ్మదిగా భూమిలోకి కూరుకుపోతుందని పరిశోధకలు సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. న్యూయార్క్ లోని అతిపెద్ద భవంతులు క్రమంగా నేలలోకి జారుకుంటున్నాయని పరిశోధన పేర్కొంది. నగరంలోని భవనాల బరువు కారణంగా సమీపంలోని నీటిలోకి మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ పరిస్థితిని సైన్స్ పరిభాషలో ‘ సబ్సిడెన్స్’ అంటారని పరిశోధకులు వెల్లడించారు.
America Crisis: గతేడాది శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. దాదాపు అదే పరిస్థితి ఇటీవల పొరుగున ఉన్న పాకిస్తాన్ లో కూడా తలెత్తింది. దీంతో తినడానికి కూడా తిండి దొరకక జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
భారతదేశం రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నప్పటికీ.. ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో భవిష్యత్ స్వదేశీ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌ల కోసం ఇంజిన్ల తయారీపై భారత్ కీలక చర్చలు జరుపుతోంది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ఎంకే2 తయారీకి వినియోగించే జనరల్ ఎలక్ట్రిక్ (GE) ఇంజిన్ల కోసం అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి.
2008 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్నందున జైలు శిక్ష అనుభవిస్తున్న కెనడాకు చెందిన కెనడా వ్యాపారి తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించాలని కాలిఫోర్నియాలోని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని జిల్లా కోర్టు అనుమతిచ్చింది.
అమెరికాలో భారత సంతతి మహిళ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్ రాష్ట్రంలో ఉంటున్న 25 ఏళ్ల లహరి పతివాడ.. ఐదు రోజుల క్రితం విధులకు వెళ్తూ అదృశ్యమయ్యారు. ఆ మరుసటి రోజే టెక్సాస్‌కు 322 కిలోమీటర్ల దూరంలో ఒక్లహోమా రాష్ట్రంలో శవమై కనిపించారు.
అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి చెందింది.. హైదరాబాద్ చెందిన తాటికొండ ఐశ్వర్య మృతి చెందినట్లుగా విచారణ సంస్థలు ధ్రువీకరించాయి.
Texas Shooting: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. టెక్సాస్ లోని ఓ షాపింగ్ మాల్ లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. టెక్సాస్ లోని డల్లాస్ శివారు అలెన్ లోని అవుట్లెట్ మాల్లో శనివారం ఒక సాయుధుడు అక్కడ ఉన్న ప్రజలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్యలను అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ఈ కాల్పులకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు హతమార్చారు.
అమెరికాలో గన్ కల్చర్ పై విమర్శలే ఉన్నాయి. ఈ క్రమంలోనే తుపాకి హింసను కట్టడి చేసేందుకు న్యూయార్క్ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న గన్ లను ఇస్తే.. గిఫ్ట్ కార్డులు ఇస్తామని ప్రకటించింది.
అమెరికా గన్‌కల్చర్ గురించి అందరికి తెలిసిన విషయమే. అగ్రరాజ్యంలో ఎక్కడో ఓ చోట గన్ సౌండ్ వినబడుతూనే ఉంటుంది. ఆ గన్‌కల్చర్‌కు అడ్డుకట్టు వేయడానికి న్యూయార్క్ ఓ సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించింది. తుపాకులను వెనక్కి ఇచ్చిన వారికి గిఫ్ట్ కార్డులు అందిస్తామని ప్రకటించింది.