చాలా మందికి కుక్కలను పిల్లులను, పెంచుకొనే అలవాటు ఉంటుంది.. కొన్నిసార్లు అవి చేసే పొరపాట్లు నవ్విస్తే.. మరికొన్ని సార్లు అవి చేసే తప్పులు కోపాన్ని తెప్పిస్తాయి.. ఇప్పుడు అలాంటి ఘటనే వెలుగు చూసింది.. ఓ పెంపుడు కుక్క ఇంట్లో ఉన్న రూ. 4 లక్షల రూపాయల కరెన్సీ నోట్లను అమాంతం మింగేసింది.. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తి గా మారింది..
ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది..అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన క్లేటన్, క్యారీ లా అనే దంపతులు ఓ కుక్కను పెంచుకుంటున్నారు. వారు ఇటీవల తమ ఇంట్లో ఉంచిన 4 వేల డాలర్లు మాయమైనట్టు గుర్తించారు. ఇంట్లో పెట్టిన డబ్బు మాయం కావడంతో వారు షాక్‌కు గురయ్యారు. చాలా సేపు అన్వేషణ తర్వాత వారికి అసలు విషయం తెలిసింది. ఇంట్లో ఉంచిన డాలర్ నోట్లను పెంపుడు కుక్క తినేసినట్టు గుర్తించారు. తీవ్రంగా ఆకలి వేయడంతో కుక్క ఆ పని చేసినట్టు తెలుసుకున్నారు..
ఇక ఆ కుక్కను హుటాహుటిన పశువైద్యుల దగ్గరకు తీసుకొని వెళ్లారు..బ్యాంకుకు వెళ్లి పరిస్థితి చెబితే వారు ఓ పరిష్కార మార్గం సూచించారు. నోట్ల సీరియల్ నంబర్లు దొరికితే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పారు. దీంతో ఆ జంట కుక్క మింగిన నోట్లను వెలికి తీయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కుక్క మలం ద్వారా, వాంతి ద్వారా బయటకు వచ్చిన నోట్లను సేకరించారు. అలా మొత్తం రూ. 2 లక్షల 95 వేల విలువైన నోట్లను కనిపెట్టారు.. మిగిలిన కాగితాలు పోవడంతో దాదాపు లక్షకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తుంది.. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు జరగలేదు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైనా ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..