భారతీయులు ఎక్కడున్నా సందడిగానే ఉంటారు. ఇక ఏ వేడుక చేసినా గ్రాండ్‌గానే చేస్తారు. చిన్న కార్యక్రమం అయినా… పెద్ద కార్యక్రమం అయినా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఏ దేశంలో ఉన్నా ఒకటే పద్ధతి ఉంటుంది. డీజేలు, చిందులు తప్పకుండా ఉంటాయి. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఓ పెళ్లి బారాత్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జీవితంలో ఒక్కసారే జరిగే మ్యూజిక్ అంటూ పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Kamal Haasan : కన్నడ భాషపై వ్యాఖ్యలు.. కమల్ హాసన్ పై కేసు
న్యూయార్క్‌లోని ఐకానిక్ వాల్ స్ట్రీట్‌లో భారతీయ వివాహ ఊరేగింపు జరిగింది. దాదాపు 400 మంది భారతీయ సాంప్రదాయ ప్రకారం దుస్తులు ధరించి పెళ్లి బారాత్‌లో పాల్గొన్నారు. చుట్టూ ఆకాశహర్మ్యాలు, న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రాంతం అద్భుత అనుభూతిని కలిగించింది. డీజేకు తగ్గట్టుగా అందరూ చిందులు లేశారు. డ్రమ్ములు వాయిస్తూ నృత్యం చేశారు. పెళ్లి బృందం.. ఎరుపు రంగు లెహంగా, లేత గోధుమరంగు షేర్వానీ ధరించి అందరి మధ్యలో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొమ్మని మోడీకి చెప్పాం.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..!
అయితే ఈ పెళ్లి వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చాలా క్రేజీగా ఉందని.. మరిచిపోలేని విధంగా న్యూయార్క్‌లో బారాత్ ప్లాన్ చేయడం చాలా గొప్ప విషయం అని పేర్కొన్నాడు. చాలా వింతగా ఉందని మరొకరు కామెంట్ చేశారు. ‘వావ్’ అంటూ ఇంకొకరు ప్రశంసించారు. ‘పిచ్చి’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ఇలా రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేశారు.