ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. కొందరు రోడ్డు ప్రమాదాల్లో, మరికొందరు కాల్పుల్లో మరణిస్తున్నారు. తమ కలల్ని నిజం చేసుకునేందుకు అమెరికా వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్తుండడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తాజగా అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Also Read:Shruthi Haasan : చీరకట్టులో శృతిహాసన్ నిండైన అందం..
ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డికి చెందిన యువకుడు గోవర్ధన్ అమెరికా లో ఎం.ఎస్. చదివేందుకు నాలుగేళ్ల క్రితం వెళ్లాడు. ఇంతలోనే ఏమైందో ఏమోగాని గోవర్ధన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గోవర్ధన్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.