ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బంది అందరికీ లేఆఫ్‌లు ఇవ్వడానికి ట్రంప్ కార్యవర్గం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వారందరినీ సెలవులో ఉంచాలని జీవో జారీ చేసింది. ఇక, అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్‌క్లూజన్ ప్రోగ్రామ్‌లను నిర్వీర్యం చేయడానికి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం పెట్టారు.
America- India: అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు.
అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. తనకు రెండు వైపుల వాదనలూ నచ్చాయి.. సమర్థవంతమైన ప్రజలు అమెరికాలోకి రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే కాదు.. అన్ని స్థాయిల వ్యక్తుల గురించి ఈ మాట చెబుతున్నాను అన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్‌పై అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణస్వీకారం ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. ట్రంప్ అధికారంలోకి వస్తే మార్కెట్‌కు కొత్త ఆశలు చిగురిస్తాయని ఆర్థిక నిపుణులు అంతా భావించారు.
America: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా డాలర్‌కు నష్టం కలిగించేలా డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Trump Diet Coke Button: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓవల్ ఆఫీసులోని ఆయన టేబుల్ పై స్పెషల్ బటన్ ను సిబ్బంది ఏర్పాటు చేశారు. ట్రంప్ ఈ బటన్ నొక్కగానే డైట్ కోక్ ను సిబ్బంది తీసుకొచ్చి ఇవ్వనున్నారు.
Donald Trump: రష్యా అధినేత పుతిన్ పై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. సోమవారం నాడు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రష్యా పెద్ద చిక్కుల్లో పడబోతుందని చెప్పుకొచ్చాడు.
Joe Biden: అమెరికా అధ్యక్షుడి పదవీ బాధ్యతల నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వీడింది కేవలం కార్యాలయాన్నే, పోరాటాన్ని కాదు అన్నారు.