Trump: హార్వర్డ్‌పై విజయం సాధిస్తా.. ట్రంప్ ప్రతిజ్ఞ
- హార్వర్డ్ యూనివర్సిటీపై విజయం సాధిస్తా
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిజ్ఞ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్వర్డ్ యూనివర్సిటీ మధ్య ట్రంప్ పరిపాలన మధ్య వివాదం నెలకొంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. యూనివర్సిటీకి అందించే సాయాన్ని నిలిపివేయడంతో పాటు పాఠ్యాంశాలు మార్చాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల విదేశీ విద్యార్థులను చేర్చుకునే సర్టిఫికేషన్ కూడా ట్రంప్ సర్కార్ రద్దు చేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రముఖుల పిల్లల భవిష్యత్ అంధకారం అయింది.
ఇది కూడా చదవండి: Mollywood : స్టార్ హీరో ఉన్ని ముకుందన్‌పై..మేనేజర్ పోలీసు కేస్
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
తాజాగా మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీపై విజయం సాధిస్తానని ప్రతిజ్ఞ చేశారు. విశ్వవిద్యాలయానికి అందాల్సిన 3 బిలియన్ డాలర్లను దక్కకుండా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ‘‘ఆ మొత్తాన్ని దేశంలోని ట్రేడ్ స్కూల్స్‌కు బదిలీ చేయాలని భావిస్తున్నా. అమెరికాకు ఇది గొప్ప పెట్టుబడి అవుతుంది. విదేశీ విద్యార్థులకు సంబంధించిన జాబితాను యూనివర్సిటీ ఇంకా అందించలేదు. దాని కోసం ఎదురుచూస్తున్నా. దేశానికి ముప్పు రాకుండా ఉండటం కోసం బిలియన్ డాలర్లు ఖర్చు చేశాం. ఆ తర్వాత కూడా ఉన్మాదులు, అమెరికాను ఇబ్బందులు పెట్టాలనుకునే వారు ఇంకా ఉన్నారా? అని తెలుసుకోవడం కోసం ఈ జాబితా ఉపయోగపడుతుంది. అప్పుడే అలాంటివారిని దేశంలోకి మళ్లీ రాకుండా నియంత్రించగలం. హార్వర్డ్‌పై మా ప్రభుత్వం విజయం సాధిస్తుంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: అదే నా ఆశ.. ఆకాంక్ష!
గతేడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌నకు వ్యతిరేకంగా హార్వర్డ్ యూనివర్సిటీ పని చేసిందన్న కోపంతో ట్రంప్ సర్కార్ పగతో రగిలిపోతుంది. అంతేకాకుండా యూదు మతానికి వ్యతిరేకంగా.. హమాస్‌కు మద్దతుగా బోధిస్తోందని ఆరోపించారు. అలాగే చైనాకు మద్దతుగా విశ్వవిద్యాలయం పని చేస్తోందని ట్రంప్ సర్కార్ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!