భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. రెండు అతి పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మధ్య టిట్-ఫర్-టాట్ టారిఫ్ వార్ కొనసాగుతుంది.. ఇకపై ఏదీ పూర్తిగా వ్యాపారం కాదు.. ప్రతిదీ కూడా వ్యక్తిగతమైనదని అన్నారు.
వైద్య రంగంలో న్యూయార్క్, మెక్సికో వైద్యులు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఏఐ టెక్నాలజీ సాయంతో ఒక మహిళకు కృత్రిమ గర్భధారణ కలిగించారు. తాజాగా 40 ఏళ్ల మహిళ ఆస్పత్రిలో ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత మస్క్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్టుగా కనిపిస్తున్నాయి. 2024 అమెరికా ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అనంతరం అధికారంలోకి వచ్చాక.. మస్క్కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
Trump Tariff: చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. ఇక, అగ్ర రాజ్యంతో ఢీ అంటే ఢీ అంటున్న డ్రాగన్పై సుంకాలు పెంచేస్తుంది. ఇప్పటిదాకా చైనాపై విధించిన టారిఫ్ లను మొత్తంగా లెక్కిస్తే 145 శాతంగా ఉంటాయని యూఎస్ స్పష్టం చేసింది.
26/11 ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవూర్ రాణా ఢిల్లీ చేరుకున్నాడు. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో రాణాను ఢిల్లీకి తీసుకొచ్చారు. రాణాను న్యాయస్థానం ఎదుట హాజరు పరచనున్నారు.
US-China Trade War: చైనా దిగుమతులపై 125 శాతం పన్నులను అగ్రరాజ్యం అమెరికా విధించింది. ఈ టారిఫ్లపై బీజింగ్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాము చైనీయులం.. కవ్వింపు చర్యలకు భయపడమని పేర్కొన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులు విడిపోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి ఒబామాతో కలిసి మిచెల్ రాజకీయ కార్యక్రమాలకు హాజరు కాకపోవడమే ఇందుకు కారణమైంది.