Trump-Putin: పుతిన్‌కు ట్రంప్ మరోసారి వార్నింగ్.. 2 వారాల్లో శాంతి ఒప్పందం చేసుకోకపోతే..!
- పుతిన్‌కు ట్రంప్ మరోసారి వార్నింగ్
- 2 వారాల్లో శాంతి ఒప్పందం చేసుకోవాలని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తు్న్నారు. కానీ సాధ్యం కావడం లేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కృషి చేస్తున్నారు. కానీ ఫలితాన్ని ఇవ్వలేదు. భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపానని పదే పదే చెబుతున్నారు. ఇక ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపినట్లు ప్రకటించారు. తాజాగా థాయ్‌లాండ్-కంబోడియా మధ్య కూడా యుద్ధాన్ని ఆపానని వెల్లడించారు. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయారు. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు ముందుకొస్తుంటే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో పుతిన్‌పై తీవ్ర స్థాయిలో ట్రంప్‌నకు కోపం వస్తోంది. అనేక మార్లు రష్యాను హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Mahadev Operation: ఉగ్రవాదుల్ని సైన్యం ఎలా మట్టుబెట్టింది.. మహాదేవ్ ఆపరేషన్ సీక్రెట్ ఇదే!
Also Read
తాజాగా మరోసారి పుతిన్‌ను ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి అంగీకరించడానికి 10-12 రోజుల సమయం ఉందని.. ఆ సమయంలోగా అంగీకరించాలని లేదంటే ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ కుదరకపోతే త్వరలో రష్యాపై ద్వితీయ సుంకాలు విధించనున్నట్లు హెచ్చరికలు పంపారు. గతంలో పుతిన్‌కు 50 రోజుల సమయం ఇచ్చారు. తాజాగా ఆ సమయాన్ని తగ్గిస్తూ సోమవారం తాజా హెచ్చరికలు జారీ చేశారు. 10-12 రోజుల్లో ఏదొకటి తేల్చాల్సిందేనని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: HHVM : క్రిష్ కథతో వీరమల్లు సెకండ్ పార్టు..!
దాదాపు 4 ఏళ్ల నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరుదేశాలు యుద్ధం కారణంగా ఎంతో నష్టపోయాయి. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. సౌదీ అరేబియా వేదికగా రష్యాతో అమెరికా చర్చలు జరిపింది. కానీ ఆ చర్చలు ఫలించలేదు. దీంతో ట్రంప్ విసుగు చెందారు. రష్యాను దెబ్బకొట్టేందుకు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా 100 శాతం సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Nimisha Priya: యెమెన్ చేరుకున్న నిమిషా ప్రియ కుటుంబ సభ్యులు.. విడిచిపెట్టాలని కుమార్తె వేడుకోలు
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?