USA: భారతీయ టెక్కీ, ఎంటర్ప్రెన్యూర్ అమెరికాలోని వాషింగ్టన్లో తన భార్య, కొడుకును కాల్చి చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఏప్రిల్ 24న జరిగింది. మరో కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రోబోటిక్స్‌లో నిపుణుడు అయిన హర్షవర్ధన కిక్కెరీ హోలో వరల్డ్‌కి సహ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ 2022లో మూతపడింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఎల్ఓసీ దగ్గర నిరంతరం కాల్పులకు తెగబడుతోంది
అమెరికా రక్షణ కార్యదర్శి హీట్ హెగ్రేత్ రాజీనామా చేశారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కొత్త కార్యదర్శి కోసం వైట్‌హౌస్ వెతుకులాట ప్రారంభించిందని వార్తలు ప్రకారం అవుతున్నాయి.
అగ్ర రాజ్యం అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ-ట్రంప్ ప్రభుత్వం మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల నిధులను ట్రంప్ సర్కార్ నిలిపివేసింది. అంతేకాకుండా యూనివర్సిటీకి కల్పించే పన్ను మినహాయింపును కూడా నిలిపివేసింది. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ-ట్రంప్ సర్కార్ ప్రత్యక్ష పోరాటానికి దిగింది.
అగ్ర రాజ్యం అమెరికా రెండవ మహిళ ఉషా వాన్స్ భారత్‌కు చేరుకున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్యగా ఉషా ఢిల్లీలో అడుగుపెట్టారు. ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు.
గత కొద్దీ రోజులుగా హార్వర్డ్ యూనివర్సిటీ వ్యవహారం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ట్రంప్ ప్రభుత్వం 2.2 బిలియన్ల గ్రాంట్లను నిలిపివేయడం, అంతేకాకుండా పన్ను మినహాయింపును ఉప సంహరించుకోవడం.. అనంతరం పాఠ్యాంశాలు కూడా మార్పులు, చేర్పులు చేయాలంటూ ట్రంప్ రాసిన లేఖ సంచలనం సృష్టించింది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియా వేదికగా పలుమార్లు రష్యా-అమెరికా అధికారుల మధ్య చర్చలు జరిగాయి.
TCS: దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన దక్షిణాసియా యేతర మాజీ ఉద్యోగులు టీసీఎస్ తీరుపై పక్షపాతంగా లే ఆఫ్‌లు అమలు చేస్తోందని పేర్కొంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాజీ అధ్యక్షుడి మరణంపై అనుచితంగా మాట్లాడారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన గురించి మాట్లాడుతూ ఇటీవల మరణించిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మరణంపై ట్రంప్ అవహేళనగా మాట్లాడారు.
అమెరికాలో ఒక వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. కత్తితో బెదిరించి తన అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రయాణికుడి అప్రమత్తమై తన దగ్గర ఉన్న లైసెన్స్ గన్‌తో కాల్పులు జరపడంతో దుండగుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.