ఇటలీ ప్రధాని మెలోనీ గురువారం అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మెలోనీ సమావేశమై సుంకాలపై చర్చించారు. అన్ని దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలు పెంచేశారు. దీంతో ప్రపంచ మార్కెట్లు ఘోరంగా దెబ్బ తిన్నాయి.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందింది. టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన దీప్తి (23) మృతి చెందింది. స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడిచివెళ్తుండగా వేగంగా వచ్చి కారు దీప్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో విద్యార్థిని పడింది. శనివారం నాటికి దీప్తి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో నెల రోజుల్లో చదువు పూర్తవుతుందనగా దీప్తి మరణించడం ఆమె కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది. గుంటూరు రాజేంద్రనగర్…
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఫ్లోరిడా యూనివర్సిటీ రక్తసిక్తమైంది. మాజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు.. నిందితుడిని చాకచాక్యంగా పట్టుకున్నారు.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత వచ్చే వారం అమెరికాకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అగ్ర రాజ్యంలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా తెలిపారు. ఏప్రిల్ 21, 22 తేదీల్లో రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో రాహుల్ ప్రసంగించనున్నారు
హార్వర్డ్ యూనివర్సిటీపై చర్యలకు ట్రంప్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపివేసింది. తాజాగా విశ్వవిద్యాలయానికి ఇస్తున్న పన్ను మినహాయింపును కూడా రద్దు చేయాలని రెవెన్యూ ఏజెన్సీకి ట్రంప్ ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
US-China Trade Conflict: అమెరికా- చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి యూఎస్ పంజా విసిరింది. డ్రాగన్ కంట్రీ దిగుమతి వస్తువులపై 245 శాతానికి పైగా సుంకాన్ని పెంచేశాడు డొనాల్డ్ ట్రంప్.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే వలసదారుల్ని కట్టడి చేశారు. ఇక అక్రమంగా అమెరికాలో ఉంటున్న వలసదారులకు తాజాగా ట్రంప్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ గట్టి షాకిచ్చింది. యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపివేసింది. హార్వర్డ్ యూనివర్సిటీ యూదు మతానికి వ్యతిరేకంగా పని చేస్తోందని.. హమాస్ మద్దతుగా కార్యకలాపాలు కొనసాగిస్తుందని వైట్‌హౌస్ ఆరోపించింది.
ఇరాన్‌ను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రస్తావన ఇరాన్ మరిచిపోవాలని.. లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు. న్యూక్లియర్ ఒప్పందం చాలా దగ్గరకు వచ్చినప్పటికీ ఇరాన్ కావాలనే తాత్సారం చేస్తోందని ఆరోపించారు.
ఎట్టకేలకు ఇరాన్ దిగొచ్చింది. అమెరికాతో అణు ఒప్పందం చేసుకొనేందుకే సిద్ధపడింది. అమెరికాతో న్యాయమైన అణు ఒప్పందం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సన్నిహితుడు అలీ షమ్ఖానీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.