పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అమెరికాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా శుక్రవారం వాషింగ్టన్‌లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అలాగే వాణిజ్య సహకారంపై కూడా ఇరువురు చర్చించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడటంలో పాకిస్థాన్ భాగస్వామ్యానికి రూబియో కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Leopard Attack Tirumala: తిరుపతిలో బైక్ ప్రయాణికులపై చిరుత దాడికి యత్నం.. భక్తుల్లో భయాందోళన!
ఇటీవల పహల్గామ్‌లో ఉగ్ర దాడికి పాల్పడ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. తాజాగా ఇషాక్ దార్ స్పందిస్తూ.. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించే సార్వభౌమాధికారం అమెరికాకు ఉందన్నారు. దీనిపై మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని.. వారి ప్రమేయం ఉందనే ఆధారాలు ఉంటే అలా చేయొచ్చని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయితే టీఆర్‌ఎఫ్‌ను లష్కరే తయిబా అనుబంధ సంస్థ అని పేర్కొనడాన్ని తప్పుబట్టారు. ఆ సంస్థను తాము కొన్ని సంవత్సరాల క్రితమే కూల్చేశామని, వారిని విచారించి, అరెస్టు చేసి జైల్లో పెట్టామన్నారు. మొత్తం ఆ సంస్థనే నాశనం చేసినట్లు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Niharika : విడాకుల నొప్పి నాకు మాత్రమే తెలుసు – నిహారిక ఓపెన్ టాక్
Met with Pakistani Deputy Prime Minister and Foreign Minister @MIshaqDar50 today to discuss expanding bilateral trade and enhancing collaboration in the critical minerals sector. I also thanked him for Pakistan’s partnership in countering terrorism and preserving regional… pic.twitter.com/QZB9RZwIA8
— Secretary Marco Rubio (@SecRubio) July 25, 2025