సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఆగస్టు 1తో డెడ్‌లైన్ ముగుస్తుంది. కానీ ఇప్పటి వరకు భారత్-అమెరికా మధ్య మాత్రం ఒప్పందం ఖరారు కాలేదు. ఇప్పటికే ఐదు రౌండ్ల చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి లభించలేదు. పాడి, వ్యవసాయంపై అమెరికా రాయితీలు కోరడంతో భారత్ వెనుకంజ వేస్తోంది. భారతీయులకు పాడి, వ్యవసాయం అనేవి సెంటిమెంట్‌తో కూడినవి. ఈ విషయంలో రాజీ పడితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితులు తలెత్తుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసమే చర్చలు ముందుకు సాగడం లేదు. మరోవైపు ట్రంప్ గడువు మాత్రం ముంచుకొస్తోంది.
ఇది కూడా చదవండి: Earthquake in Russia: రష్యాతీరంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రత.. సునామీ హెచ్చరిక జారీ
అయితే తాజాగా స్కాట్లాండ్ పర్యటన ముగించుకుని వాషింగ్టన్ వెళ్తున్న సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంపై 20 నుంచి 25 శాతం వరకు సుంకాలు ఉంటాయని హెచ్చరించారు. భారతదేశం తమకు మంచి స్నేహితుడిగా ఉందని.. అయినా భారతదేశం ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు నడుస్తున్నాయని.. ఒకవేళ చర్చలు ముగియకపోతే మాత్రం 20-25 శాతం దిగుమతి సుంకాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తన అభ్యర్థన మేరకే భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ముగిసిందని మరోసారి వ్యాఖ్యానించారు. భారత్ మంచి స్నేహితుడు కాబట్టే.. తన మాట విన్నారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Honor Killing : మరో పరువుహత్య.. ఎస్సైలుగా పనిచేస్తున్న తల్లిదండ్రులే కొడుకుతో హత్య..!
ఏప్రిల్ 2న ట్రంప్ ఆయా దేశాలపై సుంకాలు విధించారు. అయితే దేశాల నుంచి వ్యతిరేకత రావడంతో 90 రోజులు వాయిదా వేశారు. ఆ గడువు ముగియడంతో ఆగస్టు 1 వరకు మరోసారి గడువు పొడిగించారు. ఆ గడువు కూడా మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటికే ఆయా దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. అయితే భారత్ మాత్రం చర్చలు చేస్తోంది. కానీ కొలిక్కి రాలేదు. ఆగస్టు మధ్యలో అమెరికా బృందం.. భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఏదొకటి తేలే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు జరగడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Kaleshwaram Commission Report: సీల్డ్ కవర్‌లో కాళేశ్వరం కమిషన్ నివేదిక.. 3 వేల పేజీలతో డాక్యుమెంట్!
సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడానికి ఇరుదేశాలు కృషి చేస్తున్నాయి. జూలై 26న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ.. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో చర్చలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్, వియత్నాం, ఇండోనేషియా వంటి కొన్ని దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.