Indian Oil Companies: మోడీ సర్కార్కు అమెరికా షాక్.. భారత చమురు కంపెనీలపై ఆంక్షలు
- భారత్‌కు చెందిన చమురు కంపెనీలై అమెరికా ఆంక్షలు..
- ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేసిన సంస్థలపై చర్యలు..
- భారత్‌కు చెందిన 6 కంపెనీలు ఉన్నట్లు వెల్లడించిన అమెరికా విదేశాంగ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Oil Companies: భారత్‌పై అగ్రరాజ్యం అమెరికా 25 శాతం టారీఫ్స్ విధించిన వేళ మరో కీలక పరిణామం జరిగింది. ఇండియాకు చెందిన చమురు కంపెనీలపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు, మార్కెటింగ్ చేస్తున్నారు అనే అభియోగాలపై ప్రపంచ వ్యాప్తంగా 20 సంస్థలపై వైట్ హౌస్ చర్యలు తీసుకుంది. ఇందులో భారత్‌కు చెందిన 6 కంపెనీలు ఉన్నాయి. ఈ మేరకు యూఎస్ విదేశాంగ శాఖ తాజాగా ప్రకటన రిలీజ్ చేసింది. చమురు విక్రయాలతో నిధులు సమకూర్చుకొని మిడిల్ ఈస్ట్ లో సంఘర్షణలు, అస్థిరతకు ఇరాన్ ఆజ్యం పోస్తుంది. సొంత దేశ ప్రజలతో పాటు, ప్రపంచాన్ని అణచివేసేందుకు ఉగ్ర ముఠాలకు ఆర్థికంగా సపోర్టు ఇస్తుంది. అందుకే టెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు అమెరికా కఠిన చర్యలు విధిస్తుంది. ఇరాన్ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తుల వాణిజ్యంలో భాగస్వాములైన 20 కంపెనీలపై ఆంక్షలు అమలు చేస్తున్నామని అగ్రరాజ్యం ప్రకటన విడుదల చేసింది.
Read Also: Kamala Harris: కాలిఫోర్నియా గవర్నర్ పోటీపై కమలా హారిస్ క్లారిటీ
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
అయితే, భారత్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తుర్కియే, ఇండోనేషియా దేశాలకు చెందిన కంపెనీల పైనా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వారు తమ ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. అంతేగాక, అగ్రరాజ్యంతో వాణిజ్యం చేసేందుకు అర్హత కోల్పోతారని అమెరికా హెచ్చరించింది.
Read Also: OG : ఓజీ మొదటి పాటకు కౌంట్‌డౌన్ షురూ.. డేట్ ఇదేనా ?
ఆంక్షలు విధించిన భారత కంపెనీలు ఇవే..
* కాంచన్ పాలిమర్స్: 2024 ఫిబ్రవరి నుంచి జులై మధ్య 1.3 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పాలిథీన్, పెట్రోకెమికల్ ఉత్పత్తులను UAE మధ్యవర్తిత్వ కంపెనీ నుంచి కొనుగోలు, దిగుమతి చేసుకున్నట్లు అగ్రరాజ్యం అమెరికా ఆరోపలు చేసింది.
* ఆల్‌కెమికల్ సొల్యూషన్స్: 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇరాన్ నుంచి 84 మిలియన్ డాలర్ల విలువైన పెట్రోకెమికల్ ఉత్పత్తులను పెట్రోకెమికల్ ట్రేడింగ్ కంపెనీ దిగుమతి చేసుకునట్లు అమెరికా పేర్కొంది.
* రమణిక్‌లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ: 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు 22 మిలియన్ డాలర్ల విలువైన మిథనాల్, టోల్యూన్, పెట్రోకెమికల్ ఉత్పత్తులను బైయింగ్, ఇంపోర్ట్ చేసుకున్నట్లు యూఎస్ తెలిపింది.
* జుపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్: 2024-25లో 49 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఇరాన్ ఉత్పత్తులను ఇంపోర్టు చేసినట్లు అమెరికా తమ అభియోగాల్లో వెల్లడించింది.
* గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్: గతేడాది కాలంలో 51 మిలియన్ డాలర్ల విలువైన పెట్రోకెమికల్స్‌ను టెహ్రాన్ నుంచి కొన్నట్లు అగ్రరాజ్యం ఆరోపించింది.
* పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్: గతేడాది 14 మిలియన్ డాలర్ల విలువైన మిథనాల్‌తో సహా ఇరాన్ పెట్రో కెమికల్స్‌ను కొనుగోలు చేసినట్లు యూఎస్ ఆరోపణలు చేసింది. అయితే, ఈ కంపెనీలు అన్నీ ఉద్దేశపూర్వకంగానే టెహ్రాన్ తో వాణిజ్యంలో భాగస్వాములు అయ్యాయని అమెరికా చెప్పుకొచ్చింది. కాగా, ఈ ఆంక్షలు విధింపుతో ఇప్పుడు ఆయా కంపెనీలు, వ్యక్తులకు యూఎస్ లో ఆస్తులు ఉంటే వాటిని ఫ్రీజ్ చేయనున్నారు.
తాజావార్తలు
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?