ప్రధాని మోడీ అగ్ర రాజ్యం అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక ఆగస్టు చివరిలో గానీ.. సెప్టెంబర్ ప్రారంభంలో గానీ SCO సమ్మిట్ కోసం చైనా, జపాన్ కూడా సందర్శించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Vice President: పార్టీ విధేయుడికే ఉపరాష్ట్రపతి పదవి! వారికి ఛాన్స్ లేనట్లే!
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 80వ సెషన్ జరగనుంది. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు వెళ్లే అవకాశం ఉందని.. ఈ సమావేశంలో ప్రసంగించే వక్తల్లో ఒకరిగా పేర్కొన్నారు. తాత్కాలిక వక్తల జాబితాలో సెప్టెంబర్ 26, 2025న ప్రధాని మోడీ ప్రసంగించే పేర్లలో ప్రస్తావించబడింది. ఆయా దేశాల సంప్రదింపుల తర్వాత ఈ జాబితా తయారైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించడం ఖాయంగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Parents’ responsibility : పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రుల బాధ్యత
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత సంవత్సరం 79వ UNGA జనరల్ డిబేట్‌లో ప్రసంగించారు. ప్రధాని మోడీ గత సంవత్సరం కూడా యూఎన్‌కు వెళ్లి జీఏ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌లో ప్రసంగించారు. అంతేకాకుండా 2019, 2020, 2021లో కూడా జనరల్ డిబేట్‌లో మోడీ ప్రసంగించారు. ప్రస్తుతం మోడీ యూకే, మాల్దీవుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన తర్వాత చైనా, జపాన్, అమెరికా పర్యటనలు ఉండొచ్చని తెలుస్తోంది. ఇక నవంబర్‌లో జరిగే QUAD సమ్మిట్ కోసం మోడీ రష్యాలో పర్యటించే అవకాశం ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆతిథ్యం ఇవ్వనున్నారు.
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు నడుస్తున్నాయి. ఐదు రౌండ్ల చర్చలు జరిగాయి. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక అమెరికా బృందం ఆగస్టులో భారత్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. ప్రధానంగా పాడి, వ్యవసాయంపై అమెరికా మినహాయింపులు కోరుతోంది. దీంతో చర్చలు వెనుకంజ పడుతున్నాయి. అయితే ట్రంప్.. ఆగస్టు 1 డెడ్‌లైన్‌గా విధించారు. ఆలోపు చర్చలు జరుగుతాయా? లేదంటే పొడిగిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.