Trump-Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థికంగా ఎంత సాయం చేశారో అందరికీ తెలిసింది. అయితే, గెలిచిన తర్వాత ట్రంప్ కి అత్యంత సన్నిహితుడిగా మారిన మస్క్ డోజీ ద్వారా ఖర్చులు తగ్గించేందుకు కీలకంగా పని చేశారు. కానీ, ప్రస్తుతం ట్రంప్ తీసుకొస్తున్న బిగ్ బ్యూటిఫుల్ టాక్స్ బిల్ వీరి మధ్య దోస్తాన్ కి బీటలువార్చింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ప్రయత్నించినా సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రాముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. యుద్ధాన్ని ఆపేందుకు ఇరు దేశాధినేతలతో చర్చించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అమెరికా విసుగెత్తిపోయింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. గత కొంత కాలంగా ట్రంప్ ప్రభుత్వంపై మస్క్ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎక్స్ ట్విట్టర్ వేదికగా ట్రంప్ పరిపాలన నిర్ణయాలను మస్క్ ఎండగడుతున్నారు.
అమెరికాలో మరొక యూనివర్సిటీకి ట్రంప్ సర్కా్ర్తో ముప్పు వచ్చి పడింది. ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. యూదులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయం పని చేస్తుందంటూ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా సర్టిఫికేషన్‌ను రద్దు చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ కొత్త ప్రకటనపై సంతకం చేశారు. దీనితో పాటు, మరో 7 దేశాల నుంచి వచ్చే వ్యక్తులపై కఠినమైన ఆంక్షలు విధించారు. అమెరికా జాతీయ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ట్రంప్ ఈ చర్య తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాడ్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ వంటి 12…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకిచ్చారు. దేశాలతో చర్చలు జరుగుతుండగానే వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. స్టీల్, అల్యూమినియంపై సుంకాలను 50 శాతానికి పెంచుతూ ట్రంప్ సంతకం చేశారు. పెంచిన సంకాలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది.
భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. శుక్రవారం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. కొందరు రోడ్డు ప్రమాదాల్లో, మరికొందరు కాల్పుల్లో మరణిస్తున్నారు. తమ కలల్ని నిజం చేసుకునేందుకు అమెరికా వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్తుండడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తాజగా అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. Also Read:Shruthi Haasan : చీరకట్టులో శృతిహాసన్ నిండైన అందం.. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డికి చెందిన…
భారతీయులు ఎక్కడున్నా సందడిగానే ఉంటారు. ఇక ఏ వేడుక చేసినా గ్రాండ్‌గానే చేస్తారు. చిన్న కార్యక్రమం అయినా... పెద్ద కార్యక్రమం అయినా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఏ దేశంలో ఉన్నా ఒకటే పద్ధతి ఉంటుంది.