ఆగస్టు 15న ట్రంప్-పుతిన్ సమావేశం అవుతున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తు్న్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. చర్చలు ఫలించలేదు. ఇప్పుడు స్వయంగా ట్రంపే రంగంలోకి దిగుతున్నారు. అలాస్కా వేదికగా ఆగస్టు 15న ఇద్దరూ భేటీ అవుతున్నారు. శాంతి ఒప్పందం జరుగుతుందా? లేదా? అనేది సస్పెన్ష్‌గా ఉంది.
ఇది కూడా చదవండి: Trump: సుంకాలపై ట్రంప్ పక్షపాతం.. చైనాకు ఏం చేశారంటే..!
తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందించారు. సోమవారం వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పుతిన్‌తో శాంతి ఒప్పందం సాధ్యమేనా కాదా అనేది నిమిషాల్లోనే తనకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందం చేసుకునేందుకే ఆగస్టు 15న పుతిన్‌తో సమావేశం అవుతున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ త్వరగానే ముగుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నానని.. శాంతి ఒప్పందం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభమైన మొదటి రెండు నిమిషాల్లోనే ఒప్పందం జరుగుతుందా? లేదా అనేది తెలుస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: MP YS Avinash Reddy Arrest : ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..
అయితే ముందుగానే మీకెలా తెలుస్తుంది? అని రిపోర్టర్ అడిగినప్పుడు.. ట్రంప్ స్పందిస్తూ, ‘‘ఎందుకంటే నేను చేసేది అదే – నేను ఒప్పందాలు చేసుకుంటాను.’’ అని అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలని పుతిన్‌కు చెబుతానన్నారు. పుతిన్‌తో నిర్మాణాత్మక సంభాషణలు జరుపుతానని పేర్కొన్నారు. ఇక పుతిన్ అమెరికాకు రావడం చాలా గౌరవప్రదంగా చూస్తామని ట్రంప్ తెలిపారు.
తదుపరి సమావేశం తనకు.. పుతిన్‌కు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య త్రైపాక్షిక సమావేశం ఉండొచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. జెలెన్‌స్కీ-పుతిన్ మధ్య సమావేశం జరిగితే వారితో తాను కలిసి కూర్చుంటానన్నారు. ఇద్దరి మధ్య సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నానని.. అది ఇంకా ఖరారు కాలేదన్నారు.
.@POTUS: "We're going to have a meeting with Vladimir Putin and … probably in the first two minutes, I'll know exactly whether or not a deal can be made."
REPORTER: "How will you know that?"@POTUS: "Because that's what I do — I make deals." pic.twitter.com/KfLNkWaiHq
— Rapid Response 47 (@RapidResponse47) August 11, 2025