దేశంలో గత కొన్ని రోజుల నుంచి క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 2710 కేసులు నమోదు అయ్యాయి. ఇది గురువారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. నిన్న ఒక్క రోజే మహమ్మారి బారిన పడి 14 మంది మరణించారు. ఇదిలా ఉంటే 24 గంటల్లో 2296 మంది కరోనాను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 15,814 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కరోనా ప్రారంభం అయినప్పటి…
2018 ఫిబ్రవరిలో నికోలస్ క్రూజ్ అనే 19 ఏళ్ల టీనేజర్ ఫ్లోరిడాలోని స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్లో కాల్పులకు పాల్పడ్డాడు. AR-15 రైఫిల్‌తో అతడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ ఘటన అమెరికాతో పాటు యావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది. అభం శుభం తెలియని చిన్నారులను అకారణంగా కాల్చి చంపటం అందరి మనసులను కలచివేసింది. అగ్రరాజ్యం అమెరికాలో పెచ్చరిల్లుతోన్న గన్ కల్చర్‌కు ఇది ఒక ఉదాహరణ. సరిగ్గా ఐదేళ్ల తరువాత నాటి ఫ్లోరిడా…
అప్పుడే పుట్టిన చిన్నారులకు తల్లిపాలు చాలా అవసరం. ఎందుకంటే తల్లిపాలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అందుకే పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఇవ్వడానికే అందరూ ప్రాధాన్యం ఇస్తారు. అయితే కొందరు తల్లులుకు పాలు రాకపోతే పిల్లలకు సమస్య ఏర్పడుతుంది. భారత్‌లోని మహిళలకు తల్లి పాలు రాకపోవడం అన్న సమస్య అరుదుగానే ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం తల్లులకు సరిగ్గా పాలు రావు. అక్కడి మహిళలు ఆధునిక జీవనశైలిని కలిగి ఉండటం వల్ల తల్లుల్లో పాల కొరత ఏర్పడుతోంది.…
అగ్రదేశం అమెరికాలో క్రికెట్ ప్రేమికులు క్రమంగా పెరుగుతున్నారు. దీంతో అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో 2024 టీ20 ప్రపంచకప్ పోటీలకు వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా ఆతిథ్యమిస్తోంది. మరోవైపు అమెరికాలో ఐపీఎల్ తరహాలో టీ20 లీగ్ నిర్వహించబోతున్నారు. దీనికి మేజర్ క్రికెట్ లీగ్ అని నామకరణం కూడా చేశారు. ఈ లీగ్ కోసం 120 మిలియన్ డాలర్లు సేకరించాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 44 మిలియన్ డాలర్లను పోగుచేశారు. మిగిలిన…
అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. కాల్పులు జరిపి ఏకంగా 10 మందిని హతమార్చాడు ఓ దుండగుడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. న్యూయార్క్ లోని బఫెలో ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్ లో ఈ ఘటన జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు సైనిక తరహా దుస్తులు ధరించి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(…
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని నివారించేందుకు శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ప్రజలు ఇంజక్షన్ల రూపంలో కరోనా వ్యాక్సిన్‌ను తీసుకుంటున్నారు. అయితే తాజాగా ట్యాబ్లెట్ రూపంలో కరోనా వ్యాక్సిన్‌ను సైంటిస్టులు కనుగొన్నారు. దీంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. కరోనా రోగుల నోటి నుంచి వెలువడే తుంపర్ల సంఖ్యను ఈ సరికొత్త టీకా గణనీయంగా తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. ఈ…
అగ్గిపుల్లతో పొయ్యి వెలిగించుకోవచ్చు…ఇల్లూ తగలబెట్టుకోవచ్చు. అది అగ్గిపుల్ల తప్పుకాదు. ఉపయోగించేవారి విచక్షణ మీద ఆధారపడివుంటుంది. అదేవిధంగా, సాంకేతిక ప్రగతి కూడా అంతే. స్మార్ట్ ఫోన్లను టెక్నాలజీకి ఉపయోగిస్తే మంచిది. అదే మోసాలకు ఉపయోగిస్తే సమాజానికి చేటు జరుగుతుంది. దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకంలో మహిళలు ముందంజలో వున్నారంటే నమ్ముతారా? ఎస్ ముమ్మాటికి ఇది నిజమే. స్మార్ట ఫోన్ వాడకంలో ఓ రేంజ్ లో దూసుకు పోతున్నారు మన భారత దేశ మగువలు. ఇంటి పని, వంటపని ఏమో…
ప్రపంచ దేశాలు ఎంత మొత్తుకున్నా ఉత్తర కొరియా తన తీరు మార్చుకోవడం లేదు. దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందు క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. దీనికి సంబంధించి ఉపగ్రహ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఉత్తర కొరియా అణు పరీక్షలకు సిద్ధమవుతోందని అమెరికా హెచ్చరికలు చేసింది. దీనికి అనుగుణంగానే ఉత్తర కొరియా తన వైఖరిని చాటుకుంటోంది. ప్రపంచ దేశాల ఆంక్షలను, హెచ్చరికలను పక్కనపెట్టి క్షిపణి ప్రయోగాలు చేపడుతున్న ఉత్తరకొరియా తాజాగా నిన్న జలాంతర్గామి…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత ఉధృతంగా మారుతోంది. అమెరికా సహా నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తుండటంతో రష్యా సర్కారు మరింత భీకరంగా విరుచుకుపడుతోంది. నాటో దేశాలు తమను కవ్విస్తున్నాయని, ఇందుకు భారీ మూల్యం చెల్లించుకుంటాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోస్ హెచ్చరించారు. ఉక్రెయిన్ ఇలాగే మొండిగా వ్యవహరిస్తే మూడో ప్రపంచ యుద్ధం, అణ్వాయుధాల ప్రయోగం తప్పదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందంపై తాము ఇప్పటికీ ఆశాభావంతో…
అమెరికా వెళ్లి చదువుకోవాలని భావిస్తున్న విద్యార్థులకు శుభవార్త అందింది. విద్యార్థి వీసా స్లాట్ల సంఖ్యను అమెరికా భారీగా పెంచింది. దీంతో పాటు వెయిటింగ్ సమయాన్ని కూడా భారీగా తగ్గించింది. ఇటీవల ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అమెరికా వీసా స్లాట్ల కోసం సుమారు మూడేళ్ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కాన్సులేట్ కార్యాలయం పరిధి నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వెయిటింగ్ సమయాన్ని అమెరికా…