Winter Storm in America: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. అల్లాడిపోతున్న జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Winter Storm in America: క్రిస్మస్ పండుగ వేళ భయంకరమైన మంచు తుఫాను అగ్రరాజ్యమైన అమెరికాను ముంచెత్తింది. యునైటెడ్ స్టేట్స్‌లో 3,500 కిలోమీటర్ల పొడవున మంచుతుఫాను విశ్వరూపం చూపుతోంది. తూర్పు అమెరికాలో పరిస్థితి భయంకరంగా ఉంది. పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి. దాంతో అత్యధిక ప్రాంతాల్లో కరెంట్ నిలిచిపోవడంతో ప్రజల కష్టాలు పెరిగిపోయాయి. మంచు, శక్తివంతమైన ఆర్కిటిక్ గాలులతో యునైటెడ్ స్టేట్స్‌ను ముంచెత్తిన భయంకరమైన మంచు తుఫాను శనివారం 1.7 మిలియన్ల మంది ప్రజలకు విద్యుత్ లేకుండా చేసింది. 20 లక్షలకు పైగా ఇళ్లు, కార్యాలయాల్లో అంధకారం అలముకుంది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. మంచు తుఫానుతో 20 కోట్ల మందికి పైగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఎముకలు కొరికే చలి ధాటికి జనం అల్లాడిపోతున్నారు.
వాతావరణ శాఖ అనుమానించిట్టుగానే ఆర్కిటిక్ బ్లాస్ట్ కాస్తా శక్తిమంతమైన బాంబ్ సైక్లోన్‌గా రూపాంతరం చెందుతోంది. దాని దెబ్బకు చాలా రాష్ట్రాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీల కంటే కూడా దిగువకు పడిపోయాయి. గడ్డ కట్టించే చలికి 100 కిలోమీటర్ల పై చిలుకు వేగంతో వీచే అతి శీతల గాలులు తోడయ్యాయి. ఆరు రాష్ట్రాల్లో భారీ మంచు, గాలులు, ప్రమాదకరమైన శీతల ఉష్ణోగ్రతల కారణంగా దాదాపు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మంచు తుఫాను అత్యంత భయంకరమైన వాటిలో ఒకటిగా ఓ ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకటించింది. దీన్ని దేశ చరిత్రలో కనీవినీ ఎరగని వాతావరణ విపత్తుగా భావిస్తున్నారు. పొరుగు దేశం కెనడాలో కూడా పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ ఒంటారియో, క్యుబెక్ తదితర ప్రాంతాలు కూడా భరించలేని చలి, కరెంటు అంతరాయాలతో అతలాకుతలమవుతున్నాయి. బ్రిటిష్ కొలంబియా నుంచి న్యూఫౌండ్ లాండ్ దాకా కెనడాలోని మిగతా చోట్ల కూడా మంచు తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో విమాన సేవలు దాదాపుగా నిలిచిపోయాయి.
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
మరోవైపు అత్యంత ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం 6,000కు పైగా విమాన సర్వీసులు రద్దు కాగా.. తాజాగా మరో 1900 సర్వీసులు రద్దయ్యాయి. పలు సర్వీసులు ఆలస్యమయ్యాయి. దాంతో క్రిస్మస్ సంబరాల కోసం సొంతూళ్లకు, ఇతర ప్రాంతాలకు బయల్దేరిన వాళ్లు మార్గమధ్యంలో చిక్కుకున్నారు. గురువారం 3000కు పైగా విమానాలు రద్దవడం తెలిసిందే. రద్దు చేయడం వల్ల అట్లాంటా, చికాగో, డెన్వర్, డెట్రాయిట్, న్యూయార్క్‌తో సహా విమానాశ్రయాలలో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
Christmas 2022: 1500 కేజీల టమాటాలతో భారీ శాంతాక్లాజ్ సైకత శిల్పం
పశ్చిమ అమెరికాలోని మోంటానాలో ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలకు పడిపోయింది. పలు మధ్య రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. వ్యోమింగ్‌లో రాష్ట్ర చరిత్రలోనే అత్యల్పంగా మైనస్ 42 డిగ్రీలు నమోదైంది. అయోవా తదితర చోట్ల మైనస్ 38 డిగ్రీలకు తగ్గడం లేదు. డెన్వర్, కొలరాడో వంట రాష్ట్రాల్లో గత 40 ఏళ్లలో తొలిసారిగా మైనస్ 25 డిగ్రీలకు పడిపోయింది. టెన్నెసీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గత 30 ఏళ్లలో తొలిసారిగా సున్నా కంటే దిగువకు పడిపోయింది. ఇలాంటి అతి శీతల వాతావరణంలో మంచు బారిన పడితే అవయవాలను శిథిలం చేసే ప్రాణాంతకమైన ఫ్రాస్ట్ బైట్ బారిన పడేందుకు ఐదు నిమిషాలు కూడా పట్టదని జాతీయ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దని సూచించింది. హైవేలపై అడుగుల కొద్దీ మంచు పేరుకుపోవడంతో పాటు కన్ను పొడుచుకున్నా ఏమీ కన్పించని పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో న్యూయార్క్‌తో పాటు చాలా రాష్ట్రాల్లో రోడ్డు ప్రయాణాలపై నిషేధం, ఆంక్షలు విధించారు.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?