ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదులు కలకలం రేపుతున్నాయి.. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్‌పై ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి.. ఆస్పత్రిలోపలికి ఎవరూ వెళ్లకుండా సెక్యూరిటీగా సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఉంచారు.. ఆస్పత్రి ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు.. ఆస్పత్రి ఛైర్మన్ తో సహా సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.. ఈ దాడుల్లో మొత్తం 8 మంది ఈడీ అధికారులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.. అమెరికాలో వైద్యురాలుగా ఉంటూ 21-08-2022 విజయవాడలో అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిని ప్రారంభించారు అక్కినేని మణి.. ఇక, ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుపాటి పురంధేశ్వరి హాజరయ్యారు.. అయతే, విదేశీ నిధులు అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ తనిఖీలు సాగుతున్నాయి..
Read Also: Sons Betting Kills Father: మద్యం మత్తులో బెట్టింగ్.. తండ్రి చనిపోతుంటే వీడియో తీసిన కొడుకులు
మరోవైపు, గతంలో ఎన్నారై ఆస్పత్రిలో వన్ ఆఫ్ ది డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు అక్కినేని మణి.. ప్రస్తుతం విజయవాడలో మహిళలకు సంబంధించి అన్ని రకాల వైద్య సేవలను అందిస్తూ సొంత ప్రైవేట్ ఆస్పత్రిని నడుపుతున్నారు. అయితే, అక్కినేని హాస్పిటల్ సీఎండీ అయిన అక్కినేని మణిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది.. ప్రధానంగా రెండు మార్గాల ద్వారా ఆస్పత్రికి నిధులు వచ్చినట్లు సమాచారం అందుతుండగా… విదేశీ పెట్టుబడులు, నిధులు మల్లింపు ఆరోపణల నేపథ్యంలో.. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. సోదాలు నిర్వహిస్తున్నారు.. ఎన్నారై మెడికల్ మేనేజ్మెంట్ సీట్ల కింద కోట్లాది రూపాయలు నిధులు వసూళ్లు చేసినట్లు సమాచారం అందుకున్న ఈడీ ఇవాళ రైడ్స్‌కు దిగింది.. ఈ రోజు రాత్రి వరకు ఈడీ సోదాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు..