అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అధికారిక నివాసంలో శుక్రవారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. కమలా హారిస్ తమ భర్తతో కలిసి వాషింగ్టన్లోని తమ నివాసంలో దీపావళి వేడుకలను జరుపుకున్నారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో, భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల భారత మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. ఈ ఏడాది జనవరిలో ఆయనకు భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.
Newyork : అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న గుంటూరుకు చెందిన గంగూరి శ్రీనాథ్ (32) ట్రెక్కింగ్ చేస్తుండగా జారిపడి మృతి చెందాడు.
అమెరికాలో కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అగ్రరాజ్యంలో తాజాగా మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని రాలీ నగరంలో కాల్పుల ఘటనలో ఐదుగురు మరణించారు.
Rupee Value: అమెరికా కరెన్సీ డాలర్తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకు దిగజారుతోంది. చమురు ధరలు, ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల, విదేశీ సంస్థాగత నిధుల ఉపసంహరణ, యూఎస్ కరెన్సీకి డిమాండ్ పెరుగుదల వంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయని బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సోమవారం నాడు రూపాయి విలువ 82.33 నుంచి 82.66కు పడిపోయింది. అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన డాలరు నిల్వలను ఖర్చు చేస్తూ రూపాయి పతనం కాకుండా జోక్యం…
Newyork: అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ లో వలసల సంక్షోభం నెలకొంది. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోకి అక్రమ వలసదారులు భారీ సంఖ్యలో రావడంతో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందని మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్లోని రోడ్లను 2024 నాటికి అమెరికాకు దీటుగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. 2024కు ముందే ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు.
Super continent on Earth in 200 million years: భూమిపై ప్రస్తుతం ఏడు ఖండాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరో కొత్త ఖండం ఏర్పాటయ్యే అవకాశం ఉందని చైనా పెకింగ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రాబోయే 200-300 మిలియన్ సంవత్సరాల్లో ఆసియా, అమెరికా ఖండం కలిసిపోయి ఒక కొత్త సూపర్ కాంటినెంట్ ఏర్పడుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ ఖండానికి ‘అమాసియా’ అనే పేరును పెట్టారు. ఆర్కిటిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రాలు కనుమరుగు అవుతాయని తెలిపారు.…