ఉక్రెయిన్-రష్యా యుద్ధం భారత్, అమెరికా సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేయనుందా? ఇరు దేశాల మధ్య స్నేహం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందా? ఇప్పుడు ఈ రెండు అంశాల మీద అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ ఆక్రమణకు పాల్పడ్డ రష్యా చర్యను భారత్ ఖండించకుండా తటస్థ వైకరి తీసుకోవటం అమెరికా సహా పలు పశ్చిమ దేశాలకు మింగుడుపడటం లేదు. ఎలాగైనా భారత్ మనసు మర్చాలని చూస్తున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవల అమెరికా, దాని మిత్ర దేశాల విదేశాంగ…
ఉక్రెయిన్- రష్యా యుద్ధం సరికొత్త ప్రపంచ మార్పులకు దారితీస్తోంది. అమెరికా, రష్యా మధ్య పాత పగలు ఈ సంక్షోభంతో మరోసారి బయటపడ్డాయి. ప్రస్తుత పరిస్థితి ప్రచ్ఛన్న యుద్ధ రోజులను తలపిస్తోంది. ఈ క్రమంలో అమెరికా, రష్యా అతి పెద్ద దేశాలైన చైనా, భారత్ను పూర్తిగా తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా దాడికి వ్యతిరేకంగా మార్చి 2న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రవేశ పెట్టిన తీర్మానానికి 141 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి.…
అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. లాస్ ఏంజెల్స్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మంత్రి కేటీఆర్కు ఓ చిన్నారి స్వాగతం పలికింది. ఆ చిన్నారిని చూసి కేటీఆర్ సంబురపడ్డారు. ఆమె పేరు వినగానే మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ చిన్నారి పేరు ఏంటంటే.. కికో … కికో అనగా కరుణమూర్తి. ఆ అమ్మాయి పేరు విన్న కేటీఆర్ ఆమె తల్లిదండ్రులపై ప్రశంసలు కురిపించారు. ఆమె తల్లిదండ్రులు మంచి ఆలోచనాపరులంటూ చెప్పక తప్పదని ప్రశంసించారు. చిన్నారి…
ఎంతో అందమైన అమ్మాయి.. ముద్దుగా మాట్లాడి, తనతో గడుపుతాను అంటే.. ఏ మగాడు మాత్రం ఆగుతాడు. ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఆగలేదు. అమ్మాయి అందంగా ఉంది,.. అద్భుతంగా మాట్లాడుతుంది.. అన్నింటికి మించి పడక సుఖం ఇస్తాను అనడంతో సదురు వ్యక్తి ఏమి పట్టించుకోకుండా అమ్మాయిని గుడ్డిగా నమ్మాడు.. ఇక అవన్నీ ఒక పథకం ప్రకారం జరిగినవన్న విషయాన్ని తెలుసుకునే సరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వచ్చిన అమ్మడు.. ప్రేమతో రాలేదని, పగతో వచ్చిందని తెలిసేసరికి…
ఇప్పుడు ప్రపంచమంతటా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన స్టయిలే వేరంటున్నారు. పుతిన్ మాటలకు అర్థాలే వేరు?పుతిన్ యస్ అన్నాడంటే..అది నో….నో అన్నాడంటే అది పక్కా ఎస్. మాట ఒకటి…చేత ఇంకోటి. మొన్న క్రిమియాపై అదే బాట. ఆ తర్వాత డాన్ బాస్ పై అదే పాట. ఉక్రెయిన్ వార్ పై అదే తీరు. ఇప్పుడు లేటెస్టుగా ఆయన నోటి నుంచి జాలువారిన మరో డైలాగ్ బాంబ్, అణ్వస్త్ర సంసిద్ధత. మరి రష్యా అధ్యక్షుడి…
ఉక్రెయిన్పై రష్యా దాడులకు దిగడంపై అమెరికా స్పందించింది. ఉక్రెయిన్పై రష్యా దాడులను ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై రష్యా అన్యాయంగా దాడి చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్లో జరిగే పరిణామాలకు రష్యా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని రష్యా ఉల్లంఘించిందని.. రష్యా సైనిక చర్యను ఆపాలని, బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని ఆయన పేర్కొన్నారు. రష్యా దాడులకు ప్రతి చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.…
ఐదేళ్ల లోపు చిన్నారులకు కరోనా టీకా ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఆరు నెలల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఔషధ సంస్థ ఫైజర్.. ఎఫ్డీఏకు దరఖాస్తు చేసుకుంది. దీనికి అనుమతి లభిస్తే చిన్నారులకు అందుబాటులోకి వచ్చిన తొలి టీకాగా ఫైజర్ నిలవనుంది. అమెరికాలో కరోనా కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరిగిందని ఫైజర్ తెలిపింది. Read Also: కలవరపెడుతోన్న బీఏ.2 వేరియంట్.. డబ్ల్యూహెచ్వో ఆసక్తికర వ్యాఖ్యలు…
అగ్రదేశం అమెరికాను మంచు తుఫాన్ గడగడలాడిస్తోంది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో ఎక్కడ చూసినా మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తోంది. అటు రహదారులపైనా మంచు భారీగా కురుస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. మంచు కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ప్రజల సంక్షేమం కోసం అమెరికా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మంచు తుఫాన్ ధాటికి ప్రభుత్వ కార్యాలయాలను, విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. Read Also: పగబట్టిన ‘కాకి’.. ఏకంగా ఏడుగురిపై దాడి…
అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్ టీ, వెరిజాన్ టెలికాం దిగ్గజ సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి. అమెరికా నుంచి వెళ్లాల్సిన లేదా రావాల్సిన 538 విమానాలు 5జీ సేవల ప్రారంభం వల్ల రద్దు కానున్నాయని తెలుస్తోంది. రద్దయిన విమాన సర్వీసులలో ఎమిరేట్స్, ఎయిరిండియా, ఏఎన్ఏ, జపాన్ ఎయిర్లైన్స్కు సంబంధించినవి ఉన్నాయి. 5జీ సర్వీసుల్లో ఉపయోగించే ఫ్రీక్వెన్సీ విమానాల్లోని…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలో అయితే పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ దేశంలో రోజుకు దాదాపు 10 లక్షల కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈసారి బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారని అమెరికా సీడీసీ వెల్లడించింది. ముఖ్యంగా బాధితుల్లో ఐదేళ్లు లోపు చిన్నారులు ఉన్నారని తెలిపింది. ఇటీవలి కాలంలో కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న ఐదేళ్ల లోపు చిన్నారుల సంఖ్య పెరుగుతోందంటూ అమెరికా సీడీసీ డేటాను విడుదల చేసింది. 14 రాష్ట్రాల్లోని…