Joe Biden Nominates Indian-American Richard Verma For Top Diplomatic Post: భారతీయ అమెరికన్లు వ్యాపారాలు, రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అమెరికా సిలికాన్ వ్యాలీని భారత టెక్కీలు ఏలుతున్నారు. నాసా మొదలుకుని వైద్యం, వ్యాపారం ఇలా పలు రంగాల్లో భారతీయులు, భారత-అమెరికన్లు సత్తా చాటుతున్నారు. బ్రిటన్, ఐర్లాండ్ వంటి దేశాలకు భారతీయ మూలాలు ఉన్న వారు ప్రధానులుగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే అమెరికాలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరూ అధికారంలో ఉన్న భారతీయ- అమెరికన్లకు కీలక పదవులు దక్కుతున్నాయి. ఇప్పటికే జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో పలువురు కీలక స్థానాల్లో ఉన్నారు.
Read Also: Mumbai: బర్త్ డే పార్టీకని పిలిచి… మైనర్ పై ఆరుగురి పైశాచికం
ఇదిలా ఉంటే మరో భారతీయ-అమెరికన్ కు కీలక పదవి లభించింది. భారతదేశంలో అమెరికా మాజీ రాయబారి అయిన భారతీయ-అమెరికన్ లాయర్, దౌత్యవేత్త అయిన రిచర్డ్ వర్మను అధ్యక్షుడు జో బైడెన్ విదేశాంగలో అత్యున్నత స్థానానికి నామినేట్ చేశారు. 54 ఏళ్ల రిచర్డ్ వర్మను మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్సెస్ డిప్యూటీ సెక్రటరీగా జోబైడెన్ నామినేట్ చేశారని వైట్ హౌజ్ ప్రకటించింది. యూఎస్ సెనేట్ ఆమోదం పొందితే..రిచర్డ్ వర్మ స్టేట్ డిపార్ట్మెంట్ లో అత్యున్నత స్థానంలో ఉన్న భారతీయ-అమెరికన్ అవుతారు.
ప్రస్తుతం మాస్టర్ కార్డ్ లో రిచర్డ్ వర్మ చీఫ్ లీగల్ ఆఫీసర్, గ్లోబర్ పబ్లిక్ పాలసీ హెడ్ గా ఉన్నారు. గతంలో ఒబామా హయాంలో రిచర్డ్ వర్మ లెజిస్టేటివ్ వ్యవహారాల సహాయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 201-17 మధ్యకాలంలో భారత్ తో అమెరికా రాయబారిగా పనిచేశారు. కెరీర్ మొదట్లో రిచర్డ్ వర్మ అమెరిక స్టేట్ సెనెటర్ హ్యారీ రీడ్ కు జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. రిచర్డ్ వర్మను అత్యున్నత స్థానానాకి నామినేట్ చేయడాన్ని ప్రవాస భారతీయులు స్వాగతించారు. జో బిడెన్, ఆంటోనీ బ్లింకెన్ లు రిచర్డ్ వర్మను ఎంపిక చేయడం స్పూర్తిదాయకం అని కొనియాడారు.