Fire Accident: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అనపర్తి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై తాజాగా సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా…
AB Venkateswara Rao: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ప్రెస్ మీట్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.., “నాకు ఈరోజు లిఫ్ లాగా ఉంది. నా జీవితంలో కాళ్లు చేతులు ఆడినంతకాలం సమాజం కోసం పనిచేస్తాను” అంటూ తన ఆలోచనని ప్రకటించారు. మాట ప్రకారం నడుచుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని ఆయన అన్నారు. ఇకపై రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం, సమాజం కోసం పనిచేస్తానని స్పష్టంగా…
ఇద్దరు పిల్లలను కాలువలోకి తోసేసి తండ్రి అదృశ్యమైన ఘటనతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెంటూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తండ్రి పిల్లి రాజు గ్రామంలో రెండు కోట్ల రూపాయలు మేరకు అప్పులు కావడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక అదృశ్యం అయ్యాడు. పిల్లలు సందీప్, కారుణ్యలను రామచంద్రపురం మండలం తొగరువారి సావరం కాలువలో తోసివేసి.. ఆపై అదృశ్యమయ్యాడు. బాలుడు ఎలాగోలా ఒడ్డుకు చేరినా.. ఏడేళ్ల కారుణ్య ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని చూసి తల్లి విజయ…
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఊడిమూడి శివారు చింతావారి పేట సమీపంలో పంటకాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
Pinipe Srikanth Arrest: వైసీపీ నేత, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత యువకుడు, వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో శ్రీకాంత్‌ను తమిళనాడులోని మధురైలో ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వడ్డి ధర్మేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో శ్రీకాంత్ పేరు బయటికి రావడంతో.. తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేడు శ్రీకాంత్‌ను కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు.…
వరద గోదారమ్మ పోటెత్తడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి ముప్పు పొంచి ఉంది. ఆదివారం సాయంత్రానికి ఆ గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. అనేక పల్లపు ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంటలు ముంపుకు గురయ్యాయి. అయితే ఈ వరద నీరు మరింత పెరిగితే ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. ఎగువ ప్రాంతంలో వరదనీటి ఉదృతి తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతానికి ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థం అంబరానంటింది. అంబాజీపేట మండలంలోని 11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్రుల ప్రభలను ప్రత్యేకంగా అలంకరించి భుజాలపై మోసుకొని ఊరేగింపుగా తీసుకొని వచ్చి జగ్గన్నతోటలో ఆశీనులు చేశారు. ఈ ప్రభలను తిలకించేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగ్గన్నతోటలో ఆశీనులైన ఏకాదశ రుద్రులు భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది మహిళ. ఆ మహిళను ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన కొండేపూడి జ్యోతిగా గుర్తించారు. అయితే.. ఆ మహిళ ఆత్మహత్యహత్నం కారణం.. ఉప్పే బాపిరాజు అనే వ్యక్తి తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ సమీపిస్తున్న సందర్భంగా గుడిమెల్లంకలో స్థానిక ఓబెరు చర్చిలో అప్పుడే సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 70 కిలోల స్టార్ లైట్‌ను చర్చి పిల్లర్‌కు కడుతుండగా సిమెంట్ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో చెలిమి శివకృష్ణ (27) అనే యువకుడు తీవ్రగాయాల పాలయ్యాడు. అయితే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. Read Also: Andhra Pradesh: ప్రత్తిపాడులో రెండు లారీలు…