Andhra Pradesh: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోకి అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రవేశించింది. అయితే పసలపూడి గ్రామానికి చేరుకోగానే అమరావతి రైతులకు నిరసన సెగ తగిలింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు అమరావతి రైతుల యాత్రకు అడ్డుతగిలారు. అటు పోలీసులు కూడా అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకున్నారు. హైకోర్టు కేవలం 600 మందికే అనుమతి ఇచ్చిందని తెలిపారు. దీంతో పోలీసులతో అమరావతి రైతులు వాగ్వాదానికి దిగారు. ఐడీ కార్డులు చూపించిన వారిని…