అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థం అంబరానంటింది. అంబాజీపేట మండలంలోని 11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్రుల ప్రభలను ప్రత్యేకంగా అలంకరించి భుజాలపై మోసుకొని ఊరేగింపుగా తీసుకొని వచ్చి జగ్గన్నతోటలో ఆశీనులు చేశారు. పంటపొలాలు, కౌశిక నది మీదుగా జగన్నతోట వచ్చిన దృశ్యాలు గగూర్పాటు కలిగించాయి. ఈ ప్రభలను తిలకించేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగ్గన్నతోటలో ఆశీనులైన ఏకాదశ రుద్రులు భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు.
PM Modi: నాసిన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..
కాగా, కోనసీమ నడుమ తరతరాల నుండి జరుగుతున్న “జగ్గన్నతోట” ప్రభలతీర్థం వైభవానికి ఎంతో ప్రఖ్యాత ఉంది . మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి కనుమ నాడు కోనసీమలోని మొసలిపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, అతిపురాతనమైన, పవిత్రమైన సమాగమం. ప్రాచీనకాలంలో మొట్టమొదటిగా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. ఈ తోటలో ఏవిధమైన గుడి గానీ, గోపురం గానీ ఉండవు.. ఇది పూర్తిగా కొబ్బరితోట. ఈ ఏకాదశరుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఏకాదశరుద్రుల కొలువు.
Kanguva: సూర్య ‘కంగువ’ సెకండ్ లుక్ వచ్చేసింది.. చూశారా?
హిందూధర్మశాస్త్రాల ప్రకారం.. ఏకాదశరుద్రులు ఒక్కచోటకొలువు తీరేది ప్రపంచం మొత్తం మీదా, ఈ భూమండలం మొత్తానికీ ఒక్కచోటే అదీవేదసీమ అయినటువంటి కోనసీమలోనే.. లోక కల్యాణార్ధం ఈ పదకొండు గ్రామాలశివుళ్లు జగ్గన్నతోటలో సమావేశం అయ్యి లోక విషయాలుచర్చిస్తారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం నుండి ఈ సంప్రదాయం ఉందనీ తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17 వశతాబ్ధంలో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి.. లోక రక్షణగావించారని ప్రతీతి. అప్పటి నుండీ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరమూ కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా , భూమి తల్లక్రిందులైనా ఈ రుద్రులను ఒక్కచోట చేర్చుతారు ఈ గ్రామస్తులు. సంస్థానదీశులైన శ్రీరాజావత్సవాయి జగన్నాధమహారాజుకు చెందిన ఈతోట జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది.